జయములు కలుగుట యచ్చెరువా భవ
భయమును తొలగుట యచ్చెరువా
భయమును తొలగుట యచ్చెరువా
నియమము దప్పక నీశుభనామము నిత్యము పలికే నీభక్తులకు
భయభక్తులతో నినుసేవించగ రయమున కదలే నీభక్తులకు
పరమానందముతో నీచరితము నిరతము చదివే నీభక్తులకు
సురుచిరసుందరమగు నీరూపము చూచుచు వలచే నీభక్తులకు
నిను వర్ణించుచు నిను కీర్తించుచు మనసున మురిసే నీభక్తులకు
నిను ప్రార్ధించుచు నిను సేవించుచు నిలచియుండెడు నీభక్తులకు
మనసారగ నిను పూజించుచు దినదినమును దనిసే నీభక్తులకు
నిను గా కన్యుల కలలో నైనను మనసున దలచని నీభక్తులకు
హరి నీచరణములే శరణంబని యాశ్రయించు నీ నిజభక్తులకు
పరాత్పరా నీకరుణామృతమును పానము జేసిన నీభక్తులకు
తమ యెడదలు నీవిడుదులు చేసిన ధన్యాత్ములగు నీభక్తులకు
భ్రమలు విడచి శ్రీరామచంద్ర నీపదముల నుండే నిజభక్తులకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.