కం. ఇనకులపతి నీదయగల
మనుజునకున్ భవము చీలమండల లోతే
యనగా దానిని యీదుట
యను క్రియ యెక టెటుల గలుగు నయ్యా రామా
మహాత్మా సూర్యవంశనాయకా!
నీ దయ ఎంతో గొప్పది.
అది పొందినవాడే కదా అదృష్టవంతుడు.
వాడికి ఈభవసముద్రం ఒక లెక్కా?
అది వాడికి చీలమండలలోతు ఉంటుందంతే.
ఇంక వాడు దానిని ఈదటం అనే క్రియకు అవకాశమే కలుగుదు కదయ్యా రామచంద్రప్రభో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు