2, అక్టోబర్ 2023, సోమవారం

రాముని సేవించరే


రాముని సేవించరే సీతారాముని సేవించరే
ప్రేమతొ మీకెల్ల కామితముల నిచ్చు 

ఇనవంశతిలకుని ఘననీలగాత్రుని
వనజాయతాక్షుని ప్రతిలేని వీరుని
మునిరాజు గాధేయుని ప్రియ శిష్యుని
మనసిజమోహను వినుతసుశీలుని

రావణాదిదనుజవ్రాతంబు నణగించి
దేవగణముల వెతల దీర్చి రక్షించిన
దేవదేవుని హరిని భావజజనకుని
పావనమూర్తిని పట్టాభిరాముని

అవలీలగ తన యమృతనామము చేత
భవచక్రమును ద్రుంచి పరమపదమునిచ్చు
అవనీసుతాహృదయారవిందరవిని
పవమాననందనపరిసేవితాంఘ్రుని


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.