18, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఏమి చేయ వలయునో మేమేమి చేయవలయునో


ఏమి చేయ వలయునో మేమేమి చేయవలయునో

యేమి చేసి రామచంద్రుని ప్రేమ బడయవచ్చునో



మొట్టమొదట రామచంద్రుని గట్టిగా నెద నమ్మవలెను

పట్టువదలని కోరికలను గట్టిగా విదిలించవలను

పట్టివదలని సకల దుష్టవాసననలు వదిలించవలెను

పట్టుబట్టి మనసు రాముని పాదములపై నిలుపవలెను



ఎట్టులైనను రాముడే గతి యింక నాకని నమ్మవలెను

చుట్టమతడని దేవుడతడని సుస్థిరముగా నమ్మవలెను

పుట్టిన సద్భుధ్ధి రాముని పుణ్యమేనని నమ్మవలెను

ఎట్టి సందేహములు లేక యెపుడు రాముని నమ్మవలెను



పట్టుదలతో రామసేవా భాగ్యములు సాధించవలెను

గట్టి సంతోషమున రాముని ఘనముగా సేవించవలెను

పట్టువిడువక రామసేవా పథములోనే నడువవలెను

పుట్టువులు చాలింక రామ మోక్షమిమ్మని యడుగవలెను



2 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది ఈ గీతం.మీ రచనలు ఉత్తమమైనవి ఒక pdf చేసి ఇవ్వమని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భగవదనుగ్రహం ఉంటే ఇవి త్వరలో ఒక వేయి సంఖ్యకు చేరుకుంటాయండి. అప్పుడు వీటన్నింటినీ పీడీయఫ్ వాల్యూములుగా అందించాలని ఆలోచిస్తున్నాను. ఇక ఉత్తమమైనవి అంటారా. అటువంటి విభజన నేనెలా చేయగలను ఆయన ఎలా వ్రాయిస్తే అలా వ్రాస్తున్న ఉపకరణాన్ని మాత్రమే కదా నేను. మీ ఆదరణకు ధన్యవాదాలు. రామానుగ్రహం మీకుండాలని ఆశిస్తున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.