20, ఫిబ్రవరి 2020, గురువారం
పండుగ వచ్చిన గాని భగవంతుడు
పండుగ వచ్చిన గాని భగవంతుడు గుర్తుకు రాని
దండుగమారి భక్తజనుల దండే హెచ్చు
దినదినము డబ్బు దయ్యము వెనుకనే తిరుగుచు
పనిగొని పండుగ నాడే భగవంతుని వద్దకు
ధనవృద్ధి కోసమని తరచితరచి మ్రొక్కగ
చనుదెంచెడు దొంగ భక్తజనులతో గుడులు నిండు
అది లేదని యిది లేదని యనుదినము నేడ్చుచు
అదనుచూచి పండుగ యని ఆత్రముతో వత్తురు
పదేపదే తమకోర్కుల పాఠము వల్లింతురు
హృదయముల కలికమునకు నేని భక్తి యుండదు
నీమముతో నిజభక్తుల నిరంతరము బ్రోచెడు
శ్యామలాంగుడే తమకు సర్వస్వమని యెంచి
ప్రేమతో తమ గుండెలె విడుదులుగా చేసెడు
రామభక్తు లందరకును ప్రతిదినమును పండువే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పండుగ నాడైనా గన
రిప్లయితొలగించండినిం డటు లాలయముల జని నిటలాక్షుని , రా
ముండుండెడి నాత్మలొ , బ్ర
హ్మాండము నిండి భవు డుండు , నభవుండుండున్ .