21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

అకారాద్యక్షరమాలా శివస్తోత్రమ్


అత్యంతసుఖసంతోషప్రదాయ పరమాత్మనే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఆత్మరూపాయ వృధ్ధాయ అనుగ్రహపరాయతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఇనచంద్రాగ్నినేత్రాయ ఈశ్వరాయ నమోస్తుతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఈశానాయచ విఘ్నేశగురవే గురురూపిణే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఉమానాథాయ శర్వాయ లోకనాథాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఊర్ధ్వలింగాయ పూజ్యాయ దివ్యలింగాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఋగాదివేద వేద్యాయ వేదగమ్యాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఏకానేకస్వరూపాయ  శోకాదివర్జితే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఐశ్వర్యదాయ విశ్వాయ విశ్వసంపూజితే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఓంకార వాచ్యరూపాయ మహాదేవాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఔక్థికప్రీతచిత్తాయ మహారూపాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

కాలాయ కాలకాలాయ కాలకంఠాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఖగరాడ్వాహసంపూజ్యమానదివ్యాంఘ్రియుగ్మతే
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

గజచర్మాంబరాఛ్ఛాధ్యసుశ్వేతవపుషే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఘోరశ్మశానవాసాయ గతాగతాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జ్ఞానరూపాయ శాంతాయ ధ్యానగమ్యాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

చంద్రచూడాయ నిత్యాయ లోకప్రియాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఛందోనువాకసంస్త్యుత్య నిజప్రభావతే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జన్మమృత్యుజరాబాధానివారకాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఝుంకారభ్రామరీయుక్త శ్రీశైలాధిప తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

జ్ఞానగమ్యాయ యజ్ఞాయ వ్యాళరూపాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

టంకటీకాయ త్వష్టాయ త్రికంటకాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఠంకారమేరుకోదండయుక్తహస్తాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

డమరుకసృష్టవాక్ఛాస్త్రమూలసూత్రాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఢంకాతూర్యాదికస్సర్వవాద్యప్రియాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

నిస్తులాయ ప్రసన్నాయ గిరిధన్వాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

తత్త్వమసీతివాక్యార్థ లక్ష్యరూపాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

స్థాణవే సర్వసేవ్యాయ జంగమాధిప తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

దుఃఖనాశాయ సూక్ష్మాయ మహాకేశాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ధ్రువాయాభివాద్యాయ హరిణాక్షాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

నృత్యప్రియాయ హైమాయ హరికేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

పంచవక్త్రాయ భర్గాయ పరమేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

ఫాలనేత్రాయముఖ్యాయ సర్వవాసాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

బలాయ శిపివిష్ఠాయ జటాధరాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

భవాయ భవనాశాయ భూతనాథాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

మహాతపాయ సోమాయ వామదేవాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

యమగర్వాపహర్తాయ నిరవద్యాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

రుద్రాయ లోహితాక్షాయ బహురశ్మిశ్చ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

లింగాద్యక్షాయ సర్వాయ మహాకర్మాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

విరూపాక్షాయ దక్షాయ వ్యోమకేశాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

శత్రుఘ్నాయ భవఘ్నాయ ధర్మఘ్నఘ్నాయ తే‌నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

షడధ్వాతీతరూపాయ షడాశ్రయాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

సర్వవేదాంత సారాయ సద్యఃప్రసాదినే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

హరాయ లోకథాతాయ హరిప్రియాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

లలాటాక్షాయ వైద్యాయ పరబ్రహ్మాయ తే‌ నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.

క్షేమంకరాయ యోగీంద్రహృన్నివాసాయ తే నమః
నమశ్శివాయ సాంబాయ సర్వేశాయ నమో నమః.



10 కామెంట్‌లు:

  1. ఈ రోజు మాసశివరాత్రి సందర్భంగా ఈ‌ అక్షరమాలా శివస్తోత్రం చేయటమైనది.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. మీకు నచ్చినందుకు సంతోషమండీ. పారాయణోపయుక్తంగా ఉండాలనే భావన. అదే సమయంలో సులభంగా కంఠగతం కావటానికి వీలుగా ప్రతిశ్లోకంలోనూ ద్వీతీయార్థం ఒకేలా మకుటం ఉండటం ఉపయుక్తంగా ఉంటుందనీ అనుకున్నాను. ఒకటి రెండు అక్షరమాలా స్తోత్రాలు శివపరంగా కనుపించినా అవి పారాయణానికి కాని పూజలో వినియోగించుకుందుకు కాని అనువుగా లేవనిపించింది. సాధ్యమైనంతవరకూ‌ పునరుక్తి దోషం లేకుండా వ్రాసాను. కాని కొద్దిగా పునరుక్తులు ఉన్నా భక్తిసాహిత్యంలో అది దోషంగా పరిగణనలోనికి రాదు.

      తొలగించండి
    2. దాచుకోడానికి సావకాశం లేకపోయిందే :)

      తొలగించండి
    3. మిత్రులు శర్మగారు,
      అసౌకర్యం తొలగించాను. ఇప్పుడు ప్రయత్నించండి

      భవదీయుడు
      శ్యామలరావు.

      తొలగించండి
    4. స్త్రోత్రంలో పునరుక్తి దోషం కాదని మీకు చెప్పనక్కరలేదనుకుంటా!
      కాపీ చేసుకున్నా! దయతో అంగీకరించినందులకు ధన్యవాదాలు.

      తొలగించండి
    5. నమః శంభవేచ మయోభవేచ నమః శంకరాయచ మయస్కరాయచ నమః శివాయచ శివతరాయచ.

      పారాయణకు దాచుకోవడం నేటికిగాని కుదరలేదు.

      తొలగించండి
  3. మీ ఈ శివస్తోత్రం సత్యం-శివం-సుందరం! శుభాభినందనలు!!

    రిప్లయితొలగించండి
  4. తెనుగు నూతన సంవత్సర (హేవిళంబి ఉగాది) శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. అక్షరమాలా శివస్తోత్రం pdf చేసి మీకు పంపేను. దానిని కినిగె లో ప్రచురించండి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.