16, ఫిబ్రవరి 2020, ఆదివారం

రామచంద్రం భజే రమ్యసద్గుణార్ణవం కామితార్ధదాయకం కళ్యాణకారకం


రామచంద్రం భజే రమ్యసద్గుణార్ణవం

కామితార్ధదాయకం కళ్యాణకారకంకువలయాక్ష మచ్యుతం కువలయేశనందనం

భువనత్రయ పాలకం పుణ్యఫలవివర్ధకం

సవనసంరక్షకం అవనిజామనోహరం

దివిజవర్గరక్షకం దివిజవైరినాశకంసకలసుజనపూజితం సకలసంపత్ప్రదం

సకలభక్తపాలకం సకలభువనరంజకం

సకలవిద్యానిధిం సకలమునిజనాశ్రయం

సకలధర్మాశ్రయం సకలసురగణార్చితంపరమదివ్యవిగ్రహం పరమధర్మవిగ్రహం

పరమశాంతవిగ్రహం పరమవీరవిగ్రహం

పరమదయావారిధిం పరమేశ్వర మనాదిం

పరమసుఖద మవ్యయం పరమపదప్రదాయకం

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.