9, డిసెంబర్ 2015, బుధవారం

శ్రీరామచంద్రవర్త్మ






    చంద్రవర్త్మ.
    రాము డల్పుడని రావణు డనియెన్
    రామబాణమున ప్రాణము వదిలెన్
    కాముకుండు నరకంబున కరిగెన్
    భామతోడ రఘువల్లభు డరిగెన్





చంద్రవర్త్మ

దీని గణవిభజన ర - న - భ - స.  యతిస్థానం 7వ అక్షరం.

ఇది స్వాగతవృత్తానికి కవలసోదరి. ఎందుకంటే స్వాగతానికి గణవిభజన ర - న - భ - గగ కదా. అంటే స్వాగతంలోని చివరి 'గగ' అనే చతుర్మాత్రాగణానికి బదులుగా 'స' అనే మరొక చతుర్మాత్రాగణాన్ని పెడితే సరిపోతుంది. స్వాగతంలో చివర రెండుగురువుల్లో మొదటిదాన్ని రెండు లఘువులుగా మార్చితే చంద్రవర్త్మ అవుతుందన్న మాట.

ఎవరైనా పూర్వం ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

నడక వ్యవహారం చూస్తే ఇలా వస్తుంది.

    రాము  - డల్పు - డని  - రావణు - డనియెన్
    రామ - బాణ - మున - ప్రాణము - వదిలెన్
    కాము - కుండు - నర - కంబున కరిగెన్
    భామ - తోడ - రఘు -వల్లభు - డరిగెన్

13 కామెంట్‌లు:

  1. మీరు రాస్తున్నది ఒక లక్షణ గ్రంధం. తెనుగు భాషకి ఒక మణి పూస. దీని గురించి నాకు మిడిమిడి జ్ఞానమే. మీరేమీ అనుకోకపోతే మా లాటి అల్పజ్ఞుల మాటలు పట్టించుకోక కొనసాగండి. అవసరమనిపిస్తే కామెంట్ బాక్స్ తీసెయ్యండి. ఇది నా ఉబోస. మీరిది పూర్తిచేసి అచ్చు వేయిస్తే పాఠ్య గ్రంధం.

    రిప్లయితొలగించండి
  2. idanta kalipi oka pdf ga chesi andiste maa boti vaallaki chaalaa upayogam.

    I chandam harikadhaa gamanamlaa undi. daaniki deenikii emanna sambandam undaa.
    gaanaaniki chaalaa anuvugaa undi.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. ఛందస్సులో ఒక రహస్యం ఏమిటంటే ఒక పద్యలక్షణంలో సాధారణంగా నడకను గురించి చర్చ చేయటం కనిపించదు. నడకను తెలిసి వ్రాసినప్పుడు పద్యాన్ని తరచుగా గాన యోగ్యంగా చేయవచ్చును. నడకతో పాటు పదగుంఫనం పైన కొంత దృష్టి పెట్టాలి. ఎక్కడ లలితంగా ధ్వనించాలి వగైరా పట్టుగా తెలియాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో గానయోగ్యతకూ గాంభీర్యానికీ చుక్కెదురయ్యే పరిస్థితులుంటాయి. అవి తెలియాలి. అలా తెలిసి వ్రాసేటప్పుడు పాఠకులను రంజింపజేసే భాషలో వ్రాయాలి. అప్పుడంతా చక్కగా హత్తుకుంటుంది. ఇందులో ఎవరికీ సాధారణంగా కనిపించని ప్రయాస ఉంటుంది.

      తొలగించండి
  3. శర్మ గారు, చెనికల గారు
    ఇది రాయకుండా ఆపితే అదే చాలు. ఈయనకి ఏదో మొదలుపెట్టడం, మధ్యలో ఆపేసి మనల్ని కాల్చుకు తినడం ఓ సరదా. నేను ఎన్ని సార్లు చెప్పానో? పూర్తిగా రాయడం అనేది చేయరు. విసుగెత్తి నేనే మానేశాను. అన్నీ రాసాక పుస్తకం వచ్చేదాకా నేను (పెసిమిస్టునే లెండి) నమ్మేది లేదు.

    ఏమండీ శ్యామలీయం గారూ? అడ్డంకులు ఎన్ని ఉన్నాయనేది కాదు కనీ నేను చెప్పింది నిజవేనా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే కాబోలు!
      (పుస్తకాలు అచ్చేసి చేతులు కాల్చుకోవటం‌ గురించి భయపడాలీ అన్నదీ‌ నిజమే‌అనుకుంటా.)

      తొలగించండి
    2. DG గారు,
      ఈ సరి అలా జరగదండీ! నేను హైదరాబాదెళ్ళిపోయి ఇంటి దగ్గర కూచుని ధర్మాగ్రహం, సత్యాగ్రహం, ధర్నా చేసేస్తా! ఇది పూర్తి చెయ్యకపోతే.
      ధన్యవాదాలు.

      తొలగించండి
    3. పూర్తి చెయ్యండి మహాప్రభో! అచ్చు సంగతి తరవాత చూదాం.

      తొలగించండి
    4. సంతోషం అండీ. ఊరక రారు మహాత్ములు .. కదా!

      (రెండు రోజులుగా నెట్ లేదు! ఇప్పుడే వచ్చింది. పావుగంట క్రిందటనే. మొన్నరాత్రి అత్యవసరమైన కంపెనీ‌మీటింగుకు డుమ్మా ఈ‌ బీమ్‌ వాడి పుణ్యమా అని! వీళ్ళ నెట్‌వర్క్ నమ్మకం అంతంత మాత్రం కాని మళ్ళీ డబ్బులు మాత్రం‌ ఠంచనుగా వసూలు చేసుకుంటాడు!)

      తొలగించండి
    5. సార్ అత్యవసర పరిస్తితులలో సెల్ ఫోను మొబైల్ నెట్ నుండి టెతెరింగ్ (tethering) ద్వారా ఇంటర్నెట్ వాడవచ్చు. ఖర్చు పేలిపోతుంది కానీ అతిముఖ్యమయిన పనులున్నప్పుడు తప్పదు కదా.

      తొలగించండి
    6. జైగారూ, మీ రన్నట్లు మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వాడవచ్చును కాని అది నా మీటింగులకు సాధ్యం కాదు లెండి. గంటన్నరా రెండుగంటల పాటు ఆడియో-వీడియో ప్రెజంటేషన్లతో నడిచే మీటింగులకు మొబైల్ చేసే ఉడతసాయం సరిపోదు కదా! ఐనా కనీసం కనెక్ట్ అవటం ముఖ్యం - సరైన నెట్ లేదు మహాప్రభో అని చెప్పి బయటకు రావాలన్నా మొబైల్‍లో నెట్ కనెక్టివిటీ ఉండాలి లెండి. నా మొబైల్‍లో అది కూడా లేక భలే ఇబ్బంది పడ్డాను. ఈ రోజు ఉదయం దర్శనం ఇచ్చిన బీమ్‍ సర్వీస్ కాస్తా నేను పైన వ్యాఖ్య రాసిన మరొక రెండు నిముషాల్లో చక్కాపోయింది. ఓ గంటన్నర తరువాత వచ్చింది కాని అప్పటికే నేను బూట్లు వేసుకొని బయలుదేరుతున్నాను ఆఫీసుకు! సాయంత్రం నెట్ ఉంటుందన్న నమ్మకం నాస్తి.

      తొలగించండి
    7. సార్ మీరన్నట్టు బీం లాంటి ఆగడాలు మితిమీరాయి.

      తొలగించండి
  4. శర్మ గారు, చెనికల గారు
    ఇది రాయకుండా ఆపితే అదే చాలు. ఈయనకి ఏదో మొదలుపెట్టడం, మధ్యలో ఆపేసి మనల్ని కాల్చుకు తినడం ఓ సరదా. నేను ఎన్ని సార్లు చెప్పానో? పూర్తిగా రాయడం అనేది చేయరు. విసుగెత్తి నేనే మానేశాను. అన్నీ రాసాక పుస్తకం వచ్చేదాకా నేను (పెసిమిస్టునే లెండి) నమ్మేది లేదు.

    ఏమండీ శ్యామలీయం గారూ? అడ్డంకులు ఎన్ని ఉన్నాయనేది కాదు కనీ నేను చెప్పింది నిజవేనా?

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.