26, డిసెంబర్ 2015, శనివారం

శ్రీరామ సుకాంతి





        సుకాంతి.
        తరింప జే
        యరా  పరా
        త్పరా  బిరా
        న రాఘవా


సుకాంతి.

ఈ సుకాంతి వృత్తానికి గణవిభన జ - గ. అంటే నాలుగే నాలుగక్షరాలు పాదాని కన్నమాట. ఈ వృత్తాన్నే నాగవర్మ జనోదయం అన్నాడు.  దీనికే కళా అని పేరు కూడా ఉంది. యతిస్థానం అంటూ లేదు కాని ఎంత చిన్న వృత్తానికైనా (శ్రీవృత్తం తప్ప) ప్రాసనియమం తప్పదు కదా.

ఈ‌ వృత్తానికి గురులఘుక్రమం IUI  U దీనినే మనం IU  IU అనీ చూడవచ్చును. అంటే పాదానికి రెండు ఎదురు నడకతో ఉండే వ-గణాలు.

విశ్వనాథవారు ఈ‌ వృత్తాన్ని వాడుక చేసినట్లు తెలుస్తున్నది. ఎవరికైనా  ఉదాహరణ లభ్యంగా ఉంటే దయచేసి పంపగలరు. ఇతర పూర్వకవులెవరన్నా సుకాంతి వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.



4 కామెంట్‌లు:

  1. ఆనందం పరమానందం. ఈ శుభ సందర్భం లో ఒక చిన్న కోరిక. ఇనకుల తిలకుని భానువారం మత్తేభం మీద చూడాలని ఆశ. చిట్టిపొట్టి పద్యాలు ’పంక్తి’తో మళ్ళీ మొదలెడదాం!

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు శర్మగారు,
    రాముణ్ణి రేపు ఏనుగుపై ఎక్కిద్దామని ఉబలాటపడుతున్నారు. చాలా సంతోషమండీ. ఏనుగు నెక్కిన రాముడి శోభను గూర్చిన కీర్తన మీకు తప్పక ఆనందం‌ కలిగిస్తుందని అనుకుంటున్నాను. దయచేసి వేదండము నెక్కి మైథిలితో కూడి కోదండపండితు డూరేగె వేదవేద్యుని కీర్తి వేదపండితు లెల్ల వేనోళ్ళ పొగదగ నూరేగె అని నేను రెండున్నరేళ్ళ క్రిందట చేసిన కీర్తనను పరిశీలించండి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.