26, డిసెంబర్ 2015, శనివారం

రాముడికి వినయంగా

         వినయము.
         శరణం
         కరుణా
         కర దా
         శరథీవినయము.

ఈ వినయ వృత్తం ఒక చిట్టిపొట్టి వృత్తం. పాదానికి ఒకే ఒక గణం. స-గణం.  అంటే పాదం నిడివి మూడు అక్షరాలే. మరి ప్రాసను పాటించాలి కదా వృత్తం అన్నాక.

ఈ వినయ వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.

ఇంత చిన్న పద్యానికి ఇంత చిన్న టపా చాలు.

6 కామెంట్‌లు:

 1. బాగుంది,బాగుంది,పొట్టి వృత్తం, మరదే చేత్తో ’సుకాంతి’ వెలయించరా? అక్కడ న గణం అని టైపాటు చేశాననుకున్నా :)

  రిప్లయితొలగించండి
 2. ఏంటో తెలుగులో పుట్టాను తెలుగులో పెరిగాను తెలుగులో మాట్లాడతాను తెలుగులో రాస్తాను ఐనా నాకేం అర్థంకాదేం చెప్మా. నా పరిస్థితితే ఇలా ఉంటే పాపం తెలుగింగ్లీష్ తెలుగు వారి పరిస్థితేంటో.బాగుంది మీ బుల్లి పద్యం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొత్తగా బ్లాగులోకానికి వచ్చి నా బ్లాగును సందర్శించినందుకు సంతోషం. సాదరస్వాగతం.

   ఒక బుల్లి పద్యానికే మీరు గాభరా పడిపోయారే! ఇందులో ఉన్నవి మూడే పదాలు కరుణాకర, దాశరథీ, శరణం అన్నవి. ఈ‌ పదాలు నిజానికి సంస్కృతపదాలే‌ కాని తెలుగువాళ్ళందరికీ‌ అర్థమయ్యేవే అనుకుంటాను. మీరు కాదంటున్నారు.

   రోజులు మారిపోతున్నాయి. విశ్వనాథవారు అన్నట్లు ఆంగ్లమానసపుత్రులం ఐపోతున్నాం. ఆయనే సెలవిచ్చినట్లు తెలుగువాళ్ళకి అర్థం కావాలంటే ఇంగ్లీషులో చెప్పాలన్న మాట. అదీ నిజం కాదనిపిస్తోంది. మన తెలుగువాళ్ళు మాట్లాడుతున్న రోజువారీ‌ ఇంగ్లీషుని చూస్తుంటే. 'క్లారిటీగా చెప్పటం' వంటి తమాషా ప్రయోగాల సంఖ్యకు లెక్కేలేదు. భోజనాల బల్లదగ్గర రైస్, వాటర్ అని మురిసిపోయినంత వ్మాత్రాన మనం‌ చచ్చినా ఇంగ్లీషువాళ్ళం‌కాలేమన్నది మనవాళ్లకు అర్థం‌కాదు. మనవాళ్ళకు తెలుగుమీద గౌరవం లేదు, ఇంగ్లీషు ఏమంత సరిగా రాదు. ఎటుపోతున్నామో ఏమవుతున్నామో అర్థం‌కావటం‌లేదు నాకైతే.

   తొలగించండి
  2. మీ బ్లాకులోకి ఆహ్వానించినందుకు తిరుగు టపా వేసినందుకు ధన్యవాదాలు. చాలా మంచి ఈ రోజుల్లో అవసరమైన బ్లాగు.నిజమే ఎప్పటికీ మనం మనస్పూర్తిగా మన భాషని వదలేం.పరాయి భాష మన మీద రుద్దారు..అవసరానికి తప్పడంలేదు.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.