హంసమాలి. అతడే వెన్నుడయ్యా యతడే రాముడయ్యా అతనిం గొల్వవో స ద్గతియే నాస్తి కాదా |
హంసమాలి అనేది మరొక చిన్నారి వృత్తం. దీనికి గణవిభజన స - ర - గ. గురులఘుక్రమం IIUUIUU. అంటే పాదంలో ఉండేవి 7 అక్షరాలే అన్నమాట. కాబట్టి యతినియమంలేదు.
లక్షణ సారసంగ్రహంఈ వృత్తాన్ని హంసమాలి అంటే అప్పకవి హంసమాల అన్నాడు. ఈవృత్తాన్నే నాగవర్మ సరళ అన్నాడు. ఈ వృత్తానికే భూరిధామ అన్న పేరు కూడా ఉంది.
హంసమాలికి ముందొక లఘువును చేర్చితే అది వాంతభార వృత్తం IIIUUIUU అవుతుంది.
ఈవృత్తం నడకను చూస్తే మొదట నున్న స-గణం తరువాత విరుపు కనిపిస్తుంది.
పూర్వకవి ప్రయోగాలు యేమన్నా ఉన్నాయా ఈవృత్తానికి అన్నది తెలియదు.
నేనూ ఇదే చెప్పాలనుకున్నాను గానీ,
రిప్లయితొలగించండికొంచెం కన్ఫ్యూజ్ అయ్యానేమో,సారీ!