4, డిసెంబర్ 2015, శుక్రవారం

మణిరంగంతో రామస్తుతి.

       మణిరంగం.       
       శ్యామలాంగ వియచ్చరపూజ్యా
       రామచంద్ర సురారివిరోధీ      
       నామనంబున నమ్మితి నయ్యా
       ప్రేమ నేలవె వేదసువేద్యా


ఈ మణిరంగం మరొక పొట్టి వృత్తం.

గణవిభజన ర - స - స - గ .
యతిస్థానం 6వ అక్షరం.
ప్రాసనియమం ఉంది.

నడక ప్రకారం దీని గణ విభజన (హ భ) (భ గగ) అన్నట్లు ఉంటుంది.  సరిగా యతిస్థానం దగ్గర ఖండనతో.
ఉదాహరణకు నా పద్యాన్ని ఇలా నడక ప్రకారం విరచి చూపవచ్చును.

       శ్యామ - లాంగ వి - యచ్చర - పూజ్యా
       రామ - చంద్ర సు - రారివి - రోధీ      
       నామ - నంబున - నమ్మితి - నయ్యా
       ప్రేమ - నేలవె - వేదసు - వేద్యా

ఇలా మణిరంగ వృత్తాలు సులువుగా వ్రాయవచ్చును. ఆసక్తి కలవారు ప్రయత్నించండి మరి.కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.