2, డిసెంబర్ 2015, బుధవారం

శ్రీరామ భద్రకం





      భద్రకం.
      రాముడా యతడు దేవుడే
      ఏమి సందియము లేదులే
      భూమిపై నిలుప ధర్మమున్
      స్వామి తా నిలకు వచ్చెలే





భద్రక వృత్తం.

ఈ‌ భద్రకం అనే చిట్టిపొట్టి వృత్తానికి గణాలు ర - న -ర. అంటే‌పాదానికి 9 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిస్థానం ఉండదు. వృత్తం కాబట్టి ప్రాసనియమం ఉంటుంది.  ఈ‌ పద్యం నడక గణాంతాల్లో విరుపుతో ఉంటుంది.

నాకు తెలిసి పూర్వకవి ప్రయోగాలు లేవు.

పై పద్యంలో నేను సరిపాదాలకు అంత్యప్రాసను కూర్చాను.  కాని నియతంగా అంత్యప్రాసాదులు వాడవలసిన పని లేదనే అనుకుంటాను.

భద్రకాలు వ్రాయటం సులువు గానే కనిపిస్తోంది.

వీలైతే మీరూ‌ కొన్ని భద్రకాలు వ్రాయండి.





3 కామెంట్‌లు:

  1. బాగుంది వృత్తం. చిట్టిపొట్టి పద్యాలు చెప్పేసి నాకూ దురద అంటించేసేలా ఉన్నారు :)

    రిప్లయితొలగించండి
  2. శర్మ గారు రామ దురద ఎంత అంటుకుంటే అంత మంచిది :-)

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.