7, డిసెంబర్ 2015, సోమవారం

శ్రీరామ నవమాలిని

      నవమాలిని.
      ఇనకుల నాయకా యితరు లేలా
      నను నిను కన్నుగానకను తిట్టన్
      దనుజుల పైన నాదరము ధర్మం
      బన నగు నట్టి వీ రసురు లేమో
      
            
నవమాలినీ వృత్తం

ఈ నవమాలినీ వృత్తానికి గణవిభజన న - జ - భ - య.  యతిస్థానం 8వ అక్షరం. వృత్తానికి ప్రాసనియమం ఉంటుంది.
ఈ వృత్తంలో విశేషం ఏమిటంటే యతిస్థానంలో లఘువు ఉండటం. సాధారంగా వృత్తాల్లో యతిస్థానంలో ఒక గురువు ఉంటుంది.

పూర్వకవి ప్రయోగాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.

దీని నడక చూస్తే ఇల్లా ఉంది:

      ఇనకుల - నాయకా - యితరు - లేలా
      నను నిను - కన్నుగా - నకను - తిట్టన్
      దనుజుల - పైన నా - దరము - ధర్మం
      బన నగు - నట్టి వీ - రసురు -లేమో

 వేరే‌ నడకలతో ఈ వృత్తంలో‌ పద్యం సాధ్యమా అన్నది పరిశీలనార్హమైన విషయం.3 కామెంట్‌లు:


  1. వీరసురులేమో ! సందేహం కూడా నా?
    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. భేష్ ! భావం బాణమై తాకింది. రామ రావణులను పూజించే సంప్రదాయం సమాంతరంగా ద్విధా ప్రవర్తిల్లుతోంది . అస్తు . మీ పద్యంలోని చివరి రెండు పాదాల భావం మాత్రం చాల బాగుంది. ' యద్భావం తద్భవతి 'కి కొనసాగింపన్నట్టుగా.

    ఇక వ్యాకరణాంశ రీత్యా ' కొందరు లాక్షణికులు ' కన్నుగానకను - దగ్గర ' కానక ' (కాను + అక) అన్న వ్యతిరేక క్త్వార్థం ద్రుతాన్నెలా తనతో కలుపుకుంది అని అడగవచ్చు. " తెనుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది ---- " అన్న వేంకట శాస్త్రి గారెప్పుడో తమ కథలూ గాథల్లో సమాధానం చెప్పే ఉన్నారు దీనికి చెదురుమదురుగా ఉన్న కవిత్రయోదాహరణములిస్తూ . ఆయా తావుల్లో ఆయా ప్రయోగములు నిపాతములంతే ! వేరొక మాట లేదు. కనుక ఇదీ ఒకందుకు మంచిదే - ఒకానొక విద్యా సంబంధి చర్చ జరగనిస్తుంది కూడా .

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.