సుందరి. నామది గొల్చున్ స్వామిని భక్తిన్ రాముడు నాపై ప్రేముడి జూపున్ |
ఈ సుందరీవృత్తానికి గణాలు భ-గగ. అంటే పాదానికి ఐదు అక్షరాలన్నమాట. పది అక్షరాలకన్న తక్కువగా పాదం నిడివి ఉంటే యతిస్థానం ఏమీ ఉండదు. ఏ వృత్తమైనా ప్రాస తప్పదు.
ఈ వృత్తాని నాగవర్మ కాంచనమాల అంటే అనంతుడు పంక్తి అన్నాడు. ఈ వృత్తానికే ఇంకా అక్షరోపపదా , అక్షరపంక్తి , కుంతలతన్వీ , భూతలతన్వీ , హంసా అన్న పేర్లున్నాయని ఒకచోట చదివాను.
పాదానికి ఉన్న గణాలు భ అనేదీ గగ అనేదీ కూడా చతుర్మాత్రా గణాలు. కాబట్టి పాదానికి ఎనిమిది మాత్రల ప్రమాణం అనికుడా చెప్పవచ్చును. నేను చెప్పిన పై పద్యంలో భ-గణం తరువాత విరుపు కనిపిస్తోంది కదా. అలాగని అక్కడ విరుపు రావాలని అనలేం. ఉదాహరణకు ఒక సుందరీవృత్తపాదంలో 'ఏమి మహాత్మా' అని వ్రాసాం అనుకోండి అప్పుడు సలక్షణంగా ఉన్నా విరుపు మూడవ అక్షరం పైన వచ్చింది కదా. అలాగే అదే రకమైన విరుపుతో మొత్తంపద్యం వ్రాస్తే చదువరులు, ఓహో విరుపు మూడవ అక్షరం మీద బాగుంటుందన్న మాట అనుకోవచ్చును. పద్యాల్లో, ముఖ్యంగా యతివిరామం లేని పద్యాల్లో విరుపు ఎక్కడ వస్తుందో అన్నది పాదానికీ పాదానికీ కూడా మారినా అక్షేపణ ఉందదు.
ఐతే ఈ సుందరీవృత్తానికి పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.
ఆనందః భగణ గురువుతో బింబవృత్తం సాయించండి.
రిప్లయితొలగించండిబింబవృత్తం వచ్చిందండీ. తిలకించండి.
తొలగించండి