భోగవిలసిత. నేడు సుదినమో నెలంతుకా పాడవె సుదతీ పదేపదే వేడుక రఘుభూవిభుస్తుతుల్ వాడల నతి వైభవంబుగన్ |
భోగవిలసిత.
ఈ భోగవిలసిత వృత్తానికికి గణవిభజన భ-స-జ-గ అనగా గురులఘుక్రమం UII IIU IUI U తో పాదానికి 10 అక్షరాలుంటాయి. యతిస్థానం 7వ అక్షరము. ఈవృత్తానికే వీరవిలసితోర్వి అన్న మరొక పేరు కూడా ఉంది.
గురులఘుక్రమం UI III UI UI U అని విడదీస్తే అది హ-న-హ-హ-గ. అనగా నాలుగు సూర్యగణములపై ఒక గురువు. రెండవది న-గణము కాగా మిగిలిన సూర్యగణములు హ-గణములు కావలెను. చివరి గురువును త్రిమాత్రగా సాగదీసు కోవచ్చును కాబట్టి ఇది త్రిమాత్రాగణాల అమరిక అవుతున్నది.
మరొక సంగతి. గురులఘుక్రమం UII IIU IU IU అని విడదీస్తే, భ -స - వ - వ. ఇలా చూస్తే యతిస్థానమునుండి ఎదురునడక అన్నసంగతి స్ఫుటం అవుతుంది.
ఒక ఉదాహరణ పద్యం కనిపిస్తోంది.
భోగివిలసితస్ఫుటప్రభా
భోగలసితు శంభుఁ గొల్తు నే
నాగమనుతుఁ బుణ్యకీర్తనన్
నాగమటుల మంత్రముగ్ధనై
ఈభోగవిలసిత వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.
ఛందస్సు బాగా చెప్పారు
రిప్లయితొలగించండి