27, మార్చి 2026, శుక్రవారం

రేపేమి జరుగనున్నదో


రేపేమి జరుగనున్నదో నా
పాపమేమి పండనున్నదో

ఇన్ని దశాబ్దాల జీవిత మేమి నేర్పినది నాకు
తిన్నగ పదినాళ్ళు చిక్కులన్నవే లేని దెపుడు
ఇన్నాళ్ళుగా నేననుభవించినవే చాలవో
ఎన్నాళ్ళని సుఖము కోరి యీ‌ యెదురుచూపులు

పతితిపావనా రామా పతితుడనో భ్రష్టుడనో
యతిశయమై పురాకృతంబైన పాప మెంతున్నను
సతతము నీనామస్మరణ సలుపుచున్న దీనుడనే
అతులితమగు నీదయామృతము నందించకున్న

ఒక్కసారి రామా యన తుక్కగునే పాపంబులు
నిక్కువముగ రామ నిన్ను పెక్కుడు జన్మంబులుగ
చక్కగ భజియించు నన్ను మిక్కిలిగా నాదరించి
దిక్కై నీవుండకున్న తెల్లంబుగ నాబ్రతుకున