రామనామమే సుఖసాగరము రాముడె పరదైవతము
శ్రీరఘురాముని రూపమె కనులకు ప్రీతికరంబుగ నుండు
శ్రీరఘురాముని నామమె నిత్యము జిహ్వకు రుచికర మగును
శ్రీరఘురాముని పాటలె నిత్యము చెవులకు విందగు మాకు
శ్రీరఘురాముని తత్త్వమె బుధ్ధిని చింతన చేసెద మెపుడు
శ్రీరఘురాముని భక్తులె మాకు క్షితిపై బంధువు లెపుడు
శ్రీరఘురాముని పొగడెడి వారే ధారుణి మిత్రులు మాకు
శ్రీరఘురాముని నమ్మిన వారే తీరుగ మాకును హితులు
శ్రీరఘురాముని సేవకజనులే ఆరయ మాకు గురువులు
శ్రీరఘురాముని గుణగానమునే చేయుచు మురిసెద మెపుడు శ్రీరఘురాముని పాదంబులనే సేవింతుము మే మెపుడు
శ్రీరఘురాముని దివ్యమహిమలే చెప్పుచు తిరిగెద మెపుడు
శ్రీరఘురాముని తోడిదె లోకము జీవనమును మాకెపుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.