విన్నపాలు వేరెవరికి వినిపింతునయ్య
నన్ను చూసి దొంగచెముడు నటియించకు
కనులు రెండు మూసి దీర్ఘాలోచనాముద్రను
కనుపట్టు నటనము నే కనిపెట్టితిలే
నను పరీక్షించుటకై వినని యట్లుండినచో
వెనుదిరిగెదనో లేదో యని చూచుటకే
వారితోడ వీరితోడ భలే మంతనాలన్నియు
ఊరక నను నిలబెట్టగ యుక్తులేనులే
సారెకు నాయత్నములను చక్కగ నీవడ్డినచో
నేరీతిగ చేయుదునని నీవరయుటకే
సందుచూచుకొని నేను చక్కగాను విన్నవించ
నందగాడ రామచంద్ర యది విననట్లే
యుందువుగా లేని చెముడొక్కటి నీకున్నట్లే
ఇందాక మునుల నుతుల నెట్లు వింటివో
🙏🙏🙏విన్నపాలు విని కూడా విననట్లు చెముడు నటించడం! నిందా స్తుతి అద్భుతంగా ఉంది!
రిప్లయితొలగించండినిందాస్తుతి లో చాలా కీర్తనలు రమ్యంగా వెలువడ్డాయి భక్తులను అలరించాయి.ఈ కీర్తన కూడా అంతటి ఘనతను పొందుతుంది..చక్కగా కుదిరింది ఈ సంకీర్తన
రిప్లయితొలగించండి