9, జూన్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 132

శా. నీపై చిత్తము నిల్పగోరుదునయా నీ నామమాహాత్మ్యమే
నా పాపంబుల నన్నిటిం జిదుమ నానందంబుగా సర్వసం
తాపంబుల్ దిగద్రోసి నీ కొలువు నుత్సాహంబునం జేసెదన్
కాపాడం దగు నన్ను శ్రీరఘువరా కారుణ్యవారాన్నిధీ(వ్రాసిన తేదీ: 2013-5-23)


2 కామెంట్‌లు:

 1. మీ పద్యాలు చాలా బాగున్నాయి. రామదాసు కీర్తనల్లాగా వున్నాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జ్వాలానరసింహారావుగారికి సుస్వాగతం.
   అయ్యా మీకు యీ పద్యాలు నచ్చినందుకు చాలా సంతోషం.
   పరమభాగవతోత్తముడైన రామదాసస్వామివారి ముందు నేనెంత వాడను.
   మీ అభిమానానికి కృతజ్ఞుడను.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.