25, జూన్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 148

శా. ఆ రామయ్య కృపావిశేషమది రాదా జీవుడీ‌ దుష్టసం
సారంబన్నది దాటిపోవుటకు నీషణ్మాత్రమున్ పూనుకో
డా రామయ్య యనుగ్రహంబు దనపై నావంతగా గల్గుచో
క్రూరుండైన ఋషీంద్రుడౌ కవికులోత్కృష్టుండు ముక్తుండు నౌ

(వ్రాసిన తేదీ: 2013-6-2)

3 కామెంట్‌లు:

 1. అయ్యా చాలా రోజులకు మీ బ్లాగు చూసినాను. కవిత్వం బాగుంది నిజంగా. నాలుగవ పాదం యతి ఒకసారి సరిజేసుకోండి.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అయ్యా, మీ‌ స్పందనకు కృతజ్ఞతలు.
   మీరు "క్రూరుండైన ఋషీంద్రుడౌ కవికులోత్కృష్టుండు ముక్తుండు నౌ" అన్న పాదంలో క్రూ - త్కృ అన్న అక్షరాలకు యతిమైత్రి విషయం సందేహాస్పదమే మీరన్నట్లు. అయితే ఉఛ్ఛారణా సామ్యాన్ని బట్టి యతిమైత్రి కూర్చవచ్చునని భావించాను. అవసరమైతే వీలు వెంబడి సరిజేస్తాను.

   తొలగించు
 2. అయ్యా ఉత్కృష్ట అనే పదములో ఉన్న త్కృ శబ్దానికి , క్రు కారానికి యతి సామ్యము లేదు . అది ఋత్వము , ఇది రేఫ . కదా ఆలోచించండి.

  రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.