17, జనవరి 2024, బుధవారం

రామ రామ రామ యనగ రాదా

 
రామ రామ రామ యనగ రాదా మీరు శ్రీ
రామునే వేడుకొనగ రాదా మీరు

రామునే భావించగ రాదా మీరు శ్రీ
రామునే కీర్తించగ రాదా మీరు
రామునే సేవించగ రాదా మీరు శ్రీ
రాముడే జీవిత మనరాదా మీరు

రామునికథ చదువుదు మనరాదా మీరు శ్రీ
రామునికథ వినియెద మనరాదా మీరు
రాముని యెడబాయ మనరాదా మీరు శ్రీ
రాముని కృపచాలు ననరాదా మీరు


రామునికడ నుందుమనగ రాదా మీరు శ్రీ
రాము డొకడె చాలు ననగరాదా మీరు
రాము డొకడె దేవు డనగరాదా మీరు శ్రీ
రాముడే శ్రీహరి యనగరాదా మీరు