10, జనవరి 2024, బుధవారం

రామరామ యను మాటను

రామరామ యను మాటను రానీయండీ నోట
రామనామ మొక్కటే రానీయండీ

ఇడుములబడి యున్నవేళ నింత సుఖము లేని వేళ
చిడిముడిపడి యున్నవేళ చింత లధికమైన వేళ
అడవులబడి యున్నవేల నాపద లెదురైన వేళ
వడలి యొడలు చెడినవేళ వడివడి సిరి మరలు వేళ

వంచకులను నమ్మిచెడి బాధలు పడుచున్న వేళ
మంచితనము నెఱుగలేని మనుజులు నిందించు వేళ
పెంచుకున్న ఆశలే ఫలించకుండ చెడిన వేళ
కొంచెమైన నదృష్ణ మది కూడిరాక యున్న వేళ

భవవార్నిధి నీదలేక బడలి వ్యసన పడెడి వేళ
అవని నిలువలేని వేళ అతివిరక్తి కలుగు వేళ
భువనేశుడు రాముని సంపూర్ణకృపను కోరు వేళ
భవతారకరామమంత్రపఠన మొకటె దిక్కు కనుక



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.