ముక్తపురుషు లెల్లెడల పుట్టియున్నారు మనకు
శక్తిలేక వారి నెఱుగజాల కున్నాము
పుట్టువేమి ముక్తుల కనబోకండీ వారు
పుట్టియును భవరోగము పట్టనివారు
గట్టితలపు చేసి వారు కదలి వచ్చినారు
మెట్టి రండి ధరను మన మేలు కొఱ కని
మనసులోన రాముడుండు మహాత్ములు వారు
ఘనులు బ్రహ్మస్వరూపులై మనియెడు వారు
మనమధ్యనె చరించుచును మనకెఱుక గారు
మనమేలును తలచి వారు మహికి వచ్చిరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.