మేము రామభృత్యులము పో మితరుల కడకు
మేము రామభక్తులము పో మితరుల కడకు
రాముని వలచేము రాముని తలచేము
రాముని కొలిచేము మేము పో మితరుల కడకు
రాముని కొలిచేము మేము పో మితరుల కడకు
రాముడు మానాథుడు రాముడు మాకాప్తుడు
రాముడు మాదేవు డండి పో మితరుల కడకు
రాముడు సర్వేశుడు రాముడు జగదీశుడు
రాముడు పరమేశు డండి పో మితరుల కడకు
రాముడు పరమేశు డండి పో మితరుల కడకు
రాముని సేవింతుము రాముని పూజింతుము
రాముని కడ నుందు మండి పో మితరుల కడకు
రాముని కడ నుందు మండి పో మితరుల కడకు
రామనామము చాలును రాము డొకడె చాలును
రాముడె మాలోక మండి పో మితరుల కడకు
రాముడె మాలోక మండి పో మితరుల కడకు
రామునిదయ చాలును రామునిదయ చాలును
రామునిదయ చాలు నండి పో మితరుల కడకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు