కొన్ని గంటల క్రిందట ఈబ్లాగుకు కొన్ని వ్యాఖ్యలను ఎవరో అనామకుల వారు పంపారు వేరు వేరు టపాల క్రింద.
అవి ప్రచురణార్హం అనిపించక ప్రచురించక చెత్తబుట్టలో వేసాను.
ఐతే మన తెలుగు బ్లాగులోకంలో అనామకుల ధోరణి ఎలా ఉందో ఉంటుందో అందరికీ తెలిసిందే ఐనా మరొకసారి పాఠకులదృష్టికి తీసుకొని వద్దామని అనిపించి ఇక్కడ విడిగా ఒక టపాగా ఉంచుతున్నాను.
- మీరు బ్రహ్మాండమైన కవులు అనుకుంటున్నారా?? మీరు రాసేవి అద్భుతాలు అనేసుకుంటున్నరా?? పిచ్చి వాగుడు కట్టిపెట్టి నెత్తి కెక్కిన కళ్ళు కిందకు దించి చూడు. నువ్వు మామూలు మనిషివే..చిన్న పాటి కవివి కూడా కావు.
- దేవుని నిర్ణయం ప్రకారం కీర్తనలు పుడుతున్నాయి అని తెగ చెప్పుకోకు. ఎవరు ఏమి చేసినా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తాత గారు. కవిత, కథ రాసిన కూడా దైవ నిర్ణయం తోనే వారికి విషయం స్ఫురిస్తుంది. నువ్వు రాసేది దైవ నిర్ణయం, దేవుని కృప, పక్కవాడు రాసేది పేడ, పెంట. నువ్వు లోకాన్ని ఉద్దరించేవడవు. వేరొకరు పనికిమాలిన వారు. నీకు మాత్రమే తెలుసు దైవ నీతి, సాహిత్యం, పక్కవారికి ఏమీ తెలియదు. ఉత్త ఉబలటపడేవారు మాత్రమే. నీ కథలలో పస ఉందా? కీర్తనల అవి?? సంభాషణలు లాగ ఉన్నాయి, ఎగిరిపడింది చాలు, దిగు, నీ స్థాయి చిన్నది..రామదాసు అనుకోకు. నన్నయ్య తిక్కన సాహిత్యం అనుకోకు.
- కథలు అస్సలు బాగాలేవు. కీర్తనలు లో పస లేదు. ఫోన్ సంభాషణలు లాగ ఉన్నాయి. నువు రాసిన కవితలు నీకు మాత్రమే.. ఒక్కనీకు మాత్రమే..కేవలం నికే నచ్చి. నువ్వు తెగ ఫీలయి నీ దిక్కుమాలిన సాహిత్యం తో జనాలని వేదించడమే కాక, ప్రజల సాహిత్యం పై ఆరోపణలు కూడా చేస్తున్నావు. నీ అర్హత ఏమిటి? నువ్వు పీకింది ఏమిటి? ఎందులో గొప్ప నువ్వు అసలు. అక్షరం లో నైతే కావు. వయసులో ముసలోడివి అంతే..బుద్ధిలో చిన్న వాడవు
- నువ్వు ఎప్పుడు కవివి అవుతావు ఏడుపుగొట్టు తాత..అందరూ కవులు అయ్యారు అని విమర్శ ఏడుపు ఎందుకు? ప్రయత్నించు నువ్వు కూడా అవుతవేమో..మళ్ళా జన్మలో అవుదువులే..ఇప్పటి నీ రాతలకు సరస్వతి దేవి తలుపులు ముసేసుకుంది. ఇది నిజం తాత
- కవులు మయం అయ్యారా? నువ్వెప్పుడూ మయం అవుతావు.
- నువ్వు కవుల జాబితాలో ఉంటవనుకోకు. పోటు గాడి వి అనుకోకు. చేతకాని వాడివి
నాబ్లాగుకు అనామకుల తాకిడి తక్కువ. నిజానికి నాబ్లాగుకు వచ్చే వ్యాఖ్యలే తక్కువ.
ఇటువంటి వ్యాఖ్యలు రావటం అరుదు.
పై వ్యాఖ్యలలో పాటించబడిన సభ్యతాప్రమాణాలు ఎలా ఉనదీ పాఠకులు సులువుగానే గ్రహించగలరని అనుకుంటున్నాను. వాటిలోని భాషాదోషాలను గురించి ప్రస్తావించనవసరం లేదనుకుంటాను.
కుక్కకూసుకుంటే జంగం పరపతిపోయిందా?
రిప్లయితొలగించండిఇటువంటి కామెంట్లూ కొత్తకాదు,ఈ మనుషుల బుద్ధీ కొత్తకాదు.
విచారకరం! దురదృష్టం!!
అవునండి
తొలగించండిఇవేవీ నా యేకాగ్రతను చెడగొట్ఠలేవు.
// “ అవి ప్రచురణార్హం అనిపించక ప్రచురించక చెత్తబుట్టలో వేసాను.” //
రిప్లయితొలగించండిమరి అంతటితో ఆ విషయాన్ని వదిలెయ్యక మళ్ళీ ఆ వ్యాఖ్యలను మీ బ్లాగులో ఓ పోస్ట్ రూపంలో పెడితే ….. మొత్తం విషయాన్ని మీరే బజారున పెట్టుకున్నట్లు అవలా? ఎందుకు? అనవసరం కదా.
మీ బ్లాగు మీ ఇష్టం అనుకోండి గానీ మీరీ పోస్ట్ ని తొలగిస్తే మంచిదని నా ఉ.బో.స.
ఇలాంటి విపరీతపు పోకడను పాఠకుల దృష్టికి తేవటమే నా ఉద్దేశం.
తొలగించండిపలుకుడు పలికెడు నెడలను
రిప్లయితొలగించండిపలుకుల పల్కులకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికిరి తెఱగిటుల నని టపాగట్టిరిగా!
అకారణంగా అంత తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన అజ్ఞాత వ్యక్తి అజ్ఞాన వాసి కువిమర్శకుడు అయి ఉంటాడు. ఈ తరంలో
రిప్లయితొలగించండి2200 రామ కీర్తనలు వ్రాసిన గొప్ప రచయితను అభినందించడం బదులుగా అవివేక వ్యాఖ్య చేశాడు.