హరికంటెను సిరిగలవా డగుపడ డండీ మనకు
హరికంటెను పరమాత్ముం డగుపడ డండీ
హరికంటెను సరసహృదయు డగుపడ డండీ మనకు
హరికంటెను దయామయుం డగుపడ డండీ
హరికంటెను శుభదాయకు డగుపడ డండీ మనకు
హరికంటెను వరదాయకు డగుపడ డండీ
హరికంటెను బంధు వొక్క డగుపడ డండీ మనకు
హరికంటెను పరమమిత్రు డగుపడ డండీ
హరికంటెను ఆత్మబంధు వగుపడ డండీ మనకు
హరియొకడే యాత్మేశ్వరు డది నిజమండీ
హరియొకడే ఖలనాశకు డది నిజ మండీ వినుడు
హరియొకడే బుధరక్షకు డది నిజ మండీ
హరియొకడే సేవ్యు డండి యది నిజ మండీ వెలసె
హరియే శ్రీరాము డగుచు నది నిజమండీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.