మోక్ష మెవ్వరిస్తారో మోక్ష మెవ్వరిస్తారో
మోక్ష మెవ్వరిస్తారో మ్రొక్కేము వారికే
దిక్కు లన్నియును నిండి దేవత లున్నారు
చక్కగా మోక్షమీయ జాలుదురా వారు
మ్రొక్కితే వరములిచ్చు ముచ్చటయే గాని
ఒక్కరును మీకు మోక్ష మొసగనే లేరు
ఏడు కోట్ల మంత్రాలవి యెందుకున్నట్లు
వేడితే మోక్షమీని వేల్పుల మంత్రాలు
వేడ దగిన వానినే వేడవలయు నండి
వేడ దగిన విధముగా వేడవలయు నండి
వేడితే మోక్షమీని వేల్పుల మంత్రాలు
వేడ దగిన వానినే వేడవలయు నండి
వేడ దగిన విధముగా వేడవలయు నండి
వేడదగిన వాడెవ్వడు వేడుటది యెట్లు
వేడదగిన శ్రీరామ విభుని వేడుడు వాని
వేడుకైన నామమును విడువక స్మరియించి
వేడుగగా గైకొనుడు విభుడొసగును ముక్తి
వేడదగిన శ్రీరామ విభుని వేడుడు వాని
వేడుకైన నామమును విడువక స్మరియించి
వేడుగగా గైకొనుడు విభుడొసగును ముక్తి
ఇది 2200వ రామకీర్తన.
రిప్లయితొలగించండిఈ కీర్తనను ప్రస్తావిస్తూ ఒక అజ్ఞాత నన్నుతూర్పారబడుతూ ఒక వ్యాఖ్యను పంపారు. దాన్ని ప్రచురించనవసరం లేదు కాని కొందరికి ఉండే అపోహలను తొలగించటం కోసం కొన్ని మాటలు వ్రాస్తున్నాను.
రిప్లయితొలగించండిశివపురాణమూ విష్ణుపురాణమూ రెండూ వ్యాసప్రోక్తములే.
శివానందలహరీ శ్రీరామకర్ణామ్తమూ రెండూ శంకరాచార్యులవారి కృతులే.
శివపారమ్యంగా ఒకటి ఉంటే విష్ణుపారమ్యంగా మరొకటి ఉండి కొందరికి సందేహం కలిగించవచ్చు.
బ్రహ్మమొక్కటే అన్నది తెలిసి వ్రాసినవారు కాబట్టి సందర్భానుగుణంగా శివవిష్ణుపారమ్యాలను ప్రతిపాదిస్తున్న పెద్దలలో పక్షపాతమో తిరస్కారభావమో చూడరాదు. విష్ణుసహస్రంలో ఉన్న నామాలన్నీ నాకూ అన్వయిస్తాయని శివుడే చెప్పలేదా?
శ్రీరామో లలితాంబికా అనీ కృష్ణుడు శ్యామలాంబ అని ప్రతీతి. చరాచర జగన్నాథా అని లలితాంబను స్తుతించినా చరాచరజగన్నాథుడు అని రామస్తుతి చేసినా ఒకటే. రాముణ్ణి జగన్నాథుడు అంటే లలితాంబికను తిరస్కరించటం అనుకుంటే అజ్ఞానం.
అలాగే ఏడుకోట్ల మంత్రాలను తక్కువ చేయడం జ్ఞానవంతులకు తగదన్న మాట ఒకటి వచ్చింది. మంత్రాలకు ఉపదేశం ఉండాలి. భవతారకం అని ఒక్క రామనామానికి మాత్రమే ప్రతీతి. అది ఉపదేశం అవసరం లేని ఏకైక మంత్రం. సాక్షాత్తూ పరమశివుడే విష్ణునామాల్లో రామనామం గొప్పది అన్నాడు.