నమ్మండీ శ్రీరాముం డొకడే నమ్మదగినవాడు
మిమ్మును నన్నును మోసము చేయని మేలిగుణమువాడు
మిమ్మును నన్నును మోసము చేయని మేలిగుణమువాడు
భాసమానశుభలక్షణయుతుడు పరమశుభంకరుడు
వాసవాదిసురనాయకవినుతుడు బ్రహ్మాండాధిపుడు
వాసిగ భక్తుల నేలెడు వాడీ పట్టాభిరాముడు
దాసుల నెప్పుడు దయతోజూచే దశరథనందనుడు
మనసిజమోహన మూర్తి మహాత్ముడు మానవనాయకుడు
సనకాదికమునిజనసన్నుతుడు దనుజగణాంతకుడు
జనకసుతాహృదయేశ్వరుడు హరసన్నుతుడు ఘనుడు
అనిశము సద్భక్తాళికివరముల నందించెడు వాడు
సనకాదికమునిజనసన్నుతుడు దనుజగణాంతకుడు
జనకసుతాహృదయేశ్వరుడు హరసన్నుతుడు ఘనుడు
అనిశము సద్భక్తాళికివరముల నందించెడు వాడు
మరియాదాపురుషోత్తముడు హరి మంగళదాయకుడు
ధరపై వెలసిన కమలాపతి హరి ధర్మవివర్ధనుడు
శరణాగతజనసంరక్షకుడు సర్వార్ధప్రదుడు
పరమానందప్రదాయకుడు హరి పరమార్ధప్రదుడు
ధరపై వెలసిన కమలాపతి హరి ధర్మవివర్ధనుడు
శరణాగతజనసంరక్షకుడు సర్వార్ధప్రదుడు
పరమానందప్రదాయకుడు హరి పరమార్ధప్రదుడు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.