17, జనవరి 2024, బుధవారం

శ్రీరామా యనగానే


శ్రీరామా యనగానే చిక్కులన్ని తొలగవా

శ్రీరామా యనగానే చింతలన్ని యణగవా


ధారాధరశ్యాముని దయామృతము చాలదా

కోరికలు తీరవా కొఱతలన్ని తీరవా

చేరవా శుభములు క్షీణించి పాపములు

శ్రీరామా యనగానే నీరాతయె మా‌రదా


చేరవా పరుగున నిను సిరులు సంపదలును

చేరరా సుజనులు నీస్నేహమునే కోరుచు

పారరా కుజనులు నీవంక లెన్నుట మాని

శ్రీరామా యనగానే జీవితమే మారదా


ఆరవా తాపములు తీరవా మోహములు 

ఆరూఢిగ సద్భక్తి యంకురించి పెరుగదా

ఘోరభవచక్రమును కశలముగ దాటడా

శ్రీరామా యని నీవు చేకొనవా మోక్షము


4 కామెంట్‌లు:

  1. అయోధ్య నగరంలొ ఈ నెల 22 a తేదీన రామమందిర ప్రారంభోత్సవం, శ్రీ రామచంద్ర విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామ జన్మ భూమి , అయధ్యా, శ్రీరాముల పై కీర్తన మీరు వ్రాస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కావాలని ఏకీర్తననూ వ్రాయలేనండీ. రామేఛ్ఛ మేరకే వస్తాయి కీర్తనలు.

      తొలగించండి
    2. అనుకుంటే ఎందుకు వ్రాయలేరు. మీరు కీర్తన వ్రాయాలి.

      తొలగించండి
  2. అదృష్ణం. మీరు కోరుకున్న కీర్తన వచ్చిందండీ.


    యోగులు ధ్యానించు హరి యయోధ్యను నేడు
    పౌగండప్రాయుడాయె బాలరాముడై

    అని ఈకీర్తన కొద్ది సేపటి క్రిందట వెలువడింది.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.