17, జనవరి 2024, బుధవారం

శ్రీరామా యనుటయే నేరమా


హరి హరి శ్రీరామా యను మనుటే నేరమా

హరి హరి శ్రీరామా యనుటయే నేరమా


రాముడు జన్మించిన భూమి యిదే కాదా

రాముడు తిరుగాడిన భూమి యిదే కాదా

రాముడు పాలించిన భూమి యిదే కాదే

రాముడా యెవడనే రాలుగాయి లారా


రాముడే తండ్రి యను భూమి యిదే కాదా

రాముడే సర్వ మను భూమి యిదే కాదా

రాముడే దేవుడను భూమి యిదే కాదా

రామునే ద్వేషించు రాలుగాయి లారా


ఏమేమో మతము లీభూమి మీద వ్రాలగా

తామసులు మీరు మేధావు లైనారా

మీ మురికి బుధ్ధులకు రాముడు నచ్చేనా

రాముడే లేడనే రాలుగాయి లారా