18, ఫిబ్రవరి 2013, సోమవారం

శ్రీరఘురామపాదసరసీ


ఉ. శ్రీరఘురామపాదసరసీరుహ సేవన మాచరించి సీ
తారమణీలలామపదతామరసంబుల నంటి మ్రొక్కి సా
మీరి విభీషణుల్ జలజమిత్రసుతాదులు రామసోదరుల్
స్వామి యనుగ్రహంబున నవశ్యము దాటిరి జన్మచక్రమున్


(వ్రాసిన తేదీ: 2013-1-16)


1 కామెంట్‌:

 1. హమ్మయ్య,

  సీతమ్మ వారిని తెచ్చేసేరు !--> సీతా రమణీ లలామ పద తామరసంబుల '!

  ఇక మీ మీద రాములవారి కరుణా కటాక్షలములకు డోకా లేనే లేదు మరి!

  సీతాసహిత
  జిలేబి.

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.