1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సర్వము రాముడే యనుచు


ఉ. సర్వము రాముడే యనుచు చక్కగ లోన నెరింగి నట్టి వా
డుర్విని శాంత చిత్తు డగుచుండుట తథ్యము వేరు బుధ్ధియై
పర్వుచు నన్యదేవతల భావన చేసిన స్వల్పలబ్ధికే
గర్వితుడై నశించు నటు గాన రఘూద్వహు నాశ్రయించెదన్(వ్రాసిన తేదీ: 2013-1-12)