20, ఫిబ్రవరి 2013, బుధవారం

ఆ విల్లెందుకు ద్రుంచగా వలసె


శా. ఆ విల్లెందుకు ద్రుంచగా వలసె నయ్యా రామచంద్రప్రభో
నీ వద్దానిని యెత్తి యెక్కిడుటయే నీమంబు గానుండగా
ఠీవిం దోర్బల మొప్ప వంచగనె తా డిల్లాయె కాబోలు నం
తే వీరాగ్రణి వేఱు కారణము లేనే లేదు సీతాపతీ


(వ్రాసిన తేదీ: 2013-1-17)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.