నీ వున్నావు నిజముగను నే నున్నాను ఋజువుగను
దేవా నీవు కాపురుషులకు తెలియరావని యెఱుగుదును
తాపత్రయమున చిక్కిన వారు తల్లడిల్లుట నెఱుగుదును
నీ పదపద్మములందే రామా నిత్యసుఖంబని యెఱుగుదును
నాపై నీకు గల ప్రేముడియు నిక్కముగా నే నెఱుగుదును
పాపము పుణ్యము రెండును వదలుట పద్ధతి యని నే నెఱుగుదును
మధ్యమధ్యలో జగములు పుట్టి మాయమైనవని యెఱుగుదును
అధ్యక్షుడ వీ సృష్టికి నీవని యాత్మలోన నే నెఱుగుదును
మిధ్యాప్రకృతి మాయకు లొంగి మిడికే వారల నెఱుగుదును
అధ్యాత్మము నేమంత యెఱుంగని యాచార్యుల నే నెఱుగుదును
ద్యావాపృధ్వుల వ్యాపించిన నీ తత్వము చక్కగ నెఱుగుదును
భావింపగ భువి నీదగు క్రీడాప్రాంగణమని నే నెఱుగుదును
నీవే క్రీడార్థముగా నన్నిట నియమించితివని యెఱుగుదును
నీవని నేనని వేరుగ లేమని నిక్కముగా నే నెఱుగుదును
"నీ వున్నావు నిజముగను నే నున్నాను ఋజువుగను
రిప్లయితొలగించండికావలసినదదె కాపురుషులకు కనబడవని నే నెరుగుదును"
---- దేవుడు ఉన్నాడా లేడా అని వాదనలకి దిగి బుర్రలు పాడుచేసుకోవటం అనవసరం అనిపించే అసలైన పాయింటు చెప్పారు.దేవుడు లేడని అనుకునేవాళ్ళు లేడనుకుని వూరుకోకుండా నమ్మేవాళ్లని వెర్రివెధవల కింద జమకడుతున్నారని ఇప్పటివరకు కొంచెం చిరాకు పుట్టేది.మీ పాయింటు క్రమంగా అర్ధం అవుతున్న కొద్దీ వాళ్లని పట్టించుకోకపోవడమే మంచిదని అనిపిస్తున్నది - ఆధ్యాత్మికంగ అఒక మెట్టు ఎద్గదమంటే ఇదే కదూ!
చాలా బాగున్నాయండీ కీర్తనలు! ఇంతకుముందు కామెంటు రాశాను . ఎందువల్లనో కనపడటంలేదు! మీ కృషికి శుభాభినందనలండీ!
రిప్లయితొలగించండిమధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమధురకవి బిరుదు ఎవరు ఇచ్చారు ?
ఎపుడు ఇచ్చారు ? తెలుసుకోవచ్చా ?