23, ఫిబ్రవరి 2013, శనివారం

శర మొక్కింట

మ. శర మొక్కింట సుబాహునిం  దునిమి యాశ్చర్యంబుగా నప్పుడే
శరమన్యంబును వేసి చంపుటకునై సంకల్పముం జేయ వో
నర నాధోత్తమ నీవు మారిచుని దానం జేసి వైదేహినిం
చెరబట్టం గొను రావణుం దునుమగా చింతించితో రాఘవా


(వ్రాసిన తేదీ :2013-1-17)

3 కామెంట్‌లు:

  1. వెంకన్న బాబులో రామయ తండ్రిని చూసొద్దామని వెళ్ళడంతో పద్యాలు చూడటం కొరవపడింది. ధార బాగుంది, పొడిగించండి.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా ఈ సిరీస్ లో మీ పద్యాలన్నీ అద్భుతముగా ఉన్నాయి ఒక సందేహం మారీచుడిని మారిచుడు అనవచ్చునా అని- ఇట్లు భవదీయుడు సుబ్బారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏళ్ళ తరబడి మీకు సమాధానం చెప్పటం ఆలస్యం ఐనది! మారీచుడిని మారిచుడు అనవచ్చునా అన్న మీసందేహం‌ బాగుంది. అనవచ్చునండీ. ఛందోనిర్భంధాల కారణంగా ఇల్లాంటివి అప్పుడప్పుడు తప్పవు! ఎటొచ్చీ మనం కాళ్ళు గుంజోమడిచే రూపుమార్చిన మాట మరొక రకంగా అర్ధవంతమైన మాటగా మారిపోయి తికమక పెట్టకుండా ఉండాలి. అంతే.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.