1, నవంబర్ 2023, బుధవారం

ఏమిలాభ మేమిలాభము


ఏమిలాభ మేమిలాభ మేమిలాభము శ్రీ
రామమయము కాని బ్రతు కేమిలాభము

ఇంతపొడవు నాలుకుండి యేమిలాభము అది
ఎంతకును రామనామ మెత్తికొనక

ఇంతపొడవు చేతులుండి యేమిలాభము అవి
ఎంతకును హరిసేవల కియ్యకొనక

ఇంతలేసి కన్నులుండి యేమిలాభము అవి
కంతలండ్రు హరిని పొడగాంచ నేరక

ఇంతనిలువు కాళులుండి యేమిలాభము అవి
చెంతజేరి హరిపనులు చేయతిరుగక

ఎంతమంచి మనసుండియు నేమిలాభము అది
చింతించక శ్రీరాముని సంతసంబున

ఎంత బ్రతుకు బ్రతికి కూడ యేమిలాభము భగ
వంతునకే యంకితముగ బ్రతుక నేరక