కం. నీనామపు రుచిమరగిన
మానవు లిక తదితరముల మన్నించరుగా
దేనికి రుచి యధికంబగు
దానికినై జిహ్వ కుండు తహతహ రామా
ఓ రామచంద్రప్రభూ!
రుచి అంటే నీ నామమే రుచి.
ఏది రుచికరంగా ఉంటే దానికోసం జిహ్వ తహతహ లాడుతుంది కదా!
ఆరుచికరమైనది తప్ప ఇతరం సహించదు కదా.
పరమరుచికరం నీనామం.
దాని రుచి మరిగిన మనుషులు వేరేవి తలచనైనా తలచరు కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.