మానవులారా అనందం పరమానంద మదే కాదా
దినదినమును హరిసంకీర్తనమును తీయగ చేయుట అనందం
దినదినమును నారాయణునకునై పనులుచేయుట అనందం
దినదినమును హరిచరితామృతమును మనసా చదువుట అనందం
దినదినమును హరిచింతన మందున తేలియాటట అనందం
దినదినమును నారాయణునకునై పనులుచేయుట అనందం
దినదినమును హరిచరితామృతమును మనసా చదువుట అనందం
దినదినమును హరిచింతన మందున తేలియాటట అనందం
పదుగురికి హరి పారమ్యంబును విదితము చేయుట అనందం
పదుగురి మధ్యన నారాయణుని ప్రస్తుతించుట అనందం
పదుగురు కలిసి హరికీర్తనలను పాడుట మిక్కిలి అనందం
పదుగురు కలిసి హరిసేవలలో పాలుగొనుటయే అనందం
పదుగురి మధ్యన నారాయణుని ప్రస్తుతించుట అనందం
పదుగురు కలిసి హరికీర్తనలను పాడుట మిక్కిలి అనందం
పదుగురు కలిసి హరిసేవలలో పాలుగొనుటయే అనందం
అన్నితావులను హరిపరమాత్ముని యరయగలుగుట అనందం
అన్నిపనులను హరికంకితముగ యాచరించుట అనందం
అన్నివేళలను హరేరామయని యరచుచుంట అనందం
తిన్నగ వైకుంఠంబున హాయిగ దేవుని కొలుచుట అనందం
అన్నిపనులను హరికంకితముగ యాచరించుట అనందం
అన్నివేళలను హరేరామయని యరచుచుంట అనందం
తిన్నగ వైకుంఠంబున హాయిగ దేవుని కొలుచుట అనందం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.