రామ రామ రామ యనర రాముని సేవించరా
ఈమంచి మాట కన్న యేమి చెప్పేదిరా
ఈమంచి మాట కన్న యేమి చెప్పేదిరా
సకలలోకములకు హరి జనకుడని తెలియరా
అకళంగ భక్తినతని యర్చించుట మేలురా
వికచాబ్జనయను డతడె వేడుకతో రాముడై
సకలసుగుణభూషణుడై సంభవించినాడురా
అకళంగ భక్తినతని యర్చించుట మేలురా
వికచాబ్జనయను డతడె వేడుకతో రాముడై
సకలసుగుణభూషణుడై సంభవించినాడురా
మునులు రామచంద్రుని ఘనత నెఱిగినారురా
ఘనులు బ్రహ్మశివులు వాని వినుతి చేసినారురా
మునుపు భక్తవరులు కొలిచి ముక్తి పొందినారురా
తనివారా వాని గొలిచి ధన్యుడవై చెలగరా
రామని దయచేత పాపరాశి నశియించునురా
రామభక్తి కలవారికి రాని మేలు లేదురా
రాముడే వారియోగక్షేమంబుల నరయురా
భూమి మీద వారు మరల పుట్టెడుపని లేదురా
రామభక్తి కలవారికి రాని మేలు లేదురా
రాముడే వారియోగక్షేమంబుల నరయురా
భూమి మీద వారు మరల పుట్టెడుపని లేదురా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.