రామనామమే చాలండీ వేరేమీ యక్కర లేదండీ
రామనామమున కానిపని బ్రహ్మాండములోనే లేదండీ
కలిపురుషునితో కయ్యము లాడి ఘనముగ జయమును గాంచుటకు
బలమగు ఖడ్గము కావలె నంటే బహుశ్రేష్ఠంబగు ఖడ్గముగా
దారుణమగు మన పాపాటవులను తక్షణమే నిర్మూలింప
తీరగు పరశువు కావలె నంటే దివ్యమైన యొక గొడ్డలిగా
దాటరాని సంసారసాగరము దాటి యొడ్డునకు చేరుటకు
మేటినౌకయే కావలె నంటే మిక్కిలి చక్కటి నౌక యన
మరల మరల యీతనువుల దూరుట మనకెందుకని తలచినచో
త్వరగా మోక్షము సంపాదించి హరిసన్నిధిలో చేరుటకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.