16, నవంబర్ 2023, గురువారం

సెలెక్టివ్ సింపతీ!

 

చనిపోయిన మరియు చనిపోతున్న గాజానగరపు పనిపిల్లల్లారా 
ఇంకా చనిపోబోతున్న మరింతమంది గాజానగరపు పనిపిల్లల్లారా 
మీకందరికీ వీడ్కోలు ఉత్సవాలను ప్రారంభించింది ఎవరో తెలుసా?
కొందరు రాజకీయకవులు పాడుతున్నట్లు ఇజ్రాయేల్ కాదు
మీకందరకూ ఇన్నాళ్ళూ సుపరిపాలన అందించిన హమాస్ వాళ్ళు
వాళ్ళు ఇజ్రాయేల్ గర్భిణీల పొట్టలు చీల్చి ఎందరో పసికందుల్ని చంపారు.
అప్పుడీ రాజకీయకవులు ఆకళ్ళుతెరవని పిండాలమీద కవితలు పాడలేదు
ప్రతిహింస చెడ్డది అనే ఈకవులు తొలిహింసాకాండను చెడ్డది అనలేదు.
ఆ పుట్టని బిడ్డలను నాడు వాళ్ళు క్షమాపణ అడుగలేదు
బిడ్డలను కనవలసిన పిచ్చితల్లులనూ వాళ్ళు క్షమాపణ అడుగలేదు
ఇప్పుడు మిమ్మని క్షమాపణ అడుగుతున్నారు.
ఎంత సెలక్టివ్ గిల్ట్! ఎంత సెలెక్టివ్ సింపతీ. 
ఏ దిక్కుమాలిన హింసారంభకులనూ చచ్చినా క్షమించకూడదు
సెలెక్టివ్ సింపతీ డ్రామాల కవుల్ని చచ్చినా క్షమించకూడదు
గాజానగరపు పనిపిల్లల్లారా మీరు హమాస్ వాళ్ళని క్షమిస్తారా?
గాజానగరపు పనిపిల్లల్లారా మీరీ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తారా?
ఓ కాలమా నీవు ఈహమాస్ వాళ్ళని క్షమిస్తావా?
ఓ కాలమా ఈ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తావా?



నోట్:   ఇది గాజా పసిపిల్లలు అనే కవితకు ప్రతిస్పందనగా వ్రాసిన కవిత.

8 కామెంట్‌లు:

  1. ప్రతిహింస చెడ్డది అనే ఈకవులు తొలిహింసాకాండను చెడ్డది అనలేదు.


    అద్భుతః

    రిప్లయితొలగించండి
  2. బాగా వ్రాశారు. గోధ్రా దుర్ఘటన లో ఆహుతి అయిపోయిన హిందువుల విషయం లో కూడా ఇదే తీరు. పనికిమాలిన కవులు సిక్యులర్ హిందూ వ్యతిరేక శక్తులు. వీరి దృష్టి లో హిందువుల, యూదుల ప్రాణాలకు విలువ లేదు.

    ప్రపంచం లో 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఒక్క యూదు దేశం, ఒక్క హిందూ దేశం మాత్రం ఉండకూడదు 'శాంతి మతం ' వారికి.

    రిప్లయితొలగించండి
  3. అరేబాబూ! అప్పుడు చెడ్డది అన్నప్పుడు వినకుండా ఇప్పుడుకూడా చెడ్డదీ అనగానే జ్ఞానచక్షువులు తెరుచుకోని ఎగబడుతున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పుడు చెడ్డది అన్నవారు ఉన్నారు. ఆమాట వినటం జరిగింది. ఇప్పుడు వేరే వాళ్ళంతా తమనెత్తిమీదకు వచ్చేసరికి మానవతారాగాలాపనలు చేస్తున్నారు. ఇదీ అభ్యంతరకరం. గ్రహించండి.

      తొలగించండి
    2. తమరేమిటీ రామనామం వదిలి హమాస్ నామ జపం మొదలెట్టేరు ?

      తొలగించండి
    3. నేను గాజా పసిపిల్లలు అనే కవితకు జవాబుగా వ్రాసానీ టపాను అని చెప్పాను కదా. ఆ కవిత వసంతమేఘం అనే విరసం వారి పత్రికలో వచ్చింది. వారికి పాలస్తీనా ప్రజలపై ప్రేమ. మరి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నదీ ప్రజలే. వారిపై హమాస్ ఉగ్రవాదులు చేసిన పైశాచికదాడులని విరసం ఎందుకు ఖండించలేదు. ఇజ్రాయేల్ ప్రతిదాడికి దిగగానే పాలస్తీనావారి కోసం కవిత్వాలు వెలువరిస్తోంది! తొలుత హమాస్ దాడులనూ ఖండించి ఉంటే విరసం వారి ఏడుపులకు ఒక అర్ధం ఉండేది.

      తొలగించండి
    4. ఇతరమతస్తుల్ని తిట్టడంలో వున్నకిక్కు, రామనామంలో ఎక్కడిదండీ.

      తొలగించండి
    5. అజ్ఞాత19 నవంబర్, 2023 1:21 PMకి
      ఇతరమతస్తుల్ని తిట్టడంలో వున్నకిక్కు, రామనామంలో ఎక్కడిదండీ.
      hari.S.babu
      బహుశః ఆ కిక్కు తెలిసే విరసం వారలా రామనామం కన్న కిక్కు ఎక్కువ గనకనే హమాస్ ఉగ్రవాదులు చేసిన పైశాచికదాడులని విరసం ఖండించలేదు కాబోలు!

      బహుశః ఆ కిక్కు తెలిశాకనే మీరూను "ఇతరమతస్తుల్ని తిట్టడంలో వున్నకిక్కు, రామనామంలో ఎక్కడిదండీ" అని శ్యామలీయం గారికి జ్ఞానబోధ చేస్తున్నారు కాబోలు!

      కానివ్వండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.