దానవులే మానవులై దాశరథీ నేల నిదే
పూని మహా దురాత్ములై పుట్టినారయా
కొందరేమొ రాముడె లేడందురయా విన్నావా
కొందరేమొ రాముడే కుటిలుడందు రయ్యా
కొందరేమొ రావణుడే గొప్పవాడందురయా
కొందరేమొ రావణునే కొలుచుచుందు రయ్యా
కొందరేమొ నీకథలో కూటసృష్టి చేయుదురు
కొందరేమొ నీకథనే కూటసృష్టి యందురు
అందమైన నీచరితము నపహాస్యము చేయుచు
అందరును భావస్వేఛ్చ యందురయా రాముడా
దానవు లిటు చెలరేగి మానవ వేషములతో
మానక నిను చిన్నబుచ్చి మాటలాడు చుండగ
దేని కుపేక్షింతువో దేవదేవ తెలియదు
నేనేమై పోదునో నీవు గమనించవా
ఈకీర్తనకు ఒక పూర్వరంగం ఉంది అది ఇంతకు ముందటి టపాలో చెప్పాను. చూడండి ఒక ఘోరకథకు స్పందన.
రిప్లయితొలగించండి