నా పురాకృతపాపం కారణంగా ఈరోజున ఈమాట అంతర్జాల పత్రికలో ఒక ఘోరమైన నేత్రోన్మీలనం అనే కథను చదువటం తటస్థించింది.
దెబ్బకు గిలగిలలాడి. ఆకథకు స్పందనగా నామాటను అక్కడ వ్రాసాను. ఈక్షణం అది పరిశీలనలో ఉన్న వ్యాఖ్య. ఈమాట వారు దానిని ప్రచురిస్తారో లేదో తెలియదు. ప్రచురించకపోతే ఆశ్చర్యం లేదు. అందుచేత నాస్పందనను ఇక్కడ నాబ్లాగులో ఉంచుతున్నాను.
మన్నించాలి. ఈకథ నామనస్సును బాగా గాయపరచింది. ప్రాణం పోయేంతగా!
శ్రీమద్రామాయణం ఒక కథ అనుకుంటే అది వ్రాసినది వాల్మీకి మహర్షి. అయన కథలోని పాత్రలకు వ్యతిరేకమైన వ్యక్తిత్వాలను ఆపాదించి కల్పనలు చేసే స్వాతంత్రం ఎవ్వరికీ లేదు.
శ్రీమద్రామాయణం ఒక చరిత్రగ్రంథం అనుకుంటే ఆచరిత్రను గ్రంథస్థం చేసినది వాల్మీకి మహర్షి. అయన చెప్పిన చారిత్రకకథనాన్ని వెక్కిరించేలా ఆరచనలోని పాత్రలకు కొత్తకొత్త వికృతమైన కల్పనలతో మసిపూయటం క్షమార్హం కాదు.
కవులకు రచయితలకూ ఆమాటకు వస్తే అన్నిరకాల కళాకారులకు కల్పనాస్వేఛ్చ తప్పకుండా ఉంది. అంటే దాని అర్ధం ఇతరుల సృజనలోని అంశాలని విలోమం చేసి స్థలపాత్రకాలస్వభావాదులను ఇష్టారీతిగా మార్చిపారెయ్యటం కూడా స్వేఛ్చగా చేయవచ్చును అని అర్ధం కాదు.
రామాయణం ఆధారంగా అనాదిగా ఎందరో కవులు ఎన్నో ఎన్నెన్నో కల్పనలు చేసారు. కాని ఎవరూ రామాయణపాత్రలను అనుచితంగా చిత్రించి అపచారం చేయలేదు.
ఆధునిక భావజాలం పేరుతో భారతీయసనాతన సంప్రదాయాలనూ సాహిత్యాన్ని చరిత్రనూ కళలనూ అన్నింటినీ వెక్కిరిస్తూ వినూత్నకల్పనలు చేసి సంతోషించే గుణం పెరిగిపోతూ ఉన్నది. ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. భారతీయులు తమ మూలాలపట్ల సిగ్గుపడాలీ అని ప్రచారం చేయటమే ఈఆధునికత యొక్క లక్ష్యంలాగా తోస్తోంది. ఈపైత్యం వెనుక వాముపక్షమో జీలకర్రపక్షమో ఏదో భావజాలాన్ని అందిస్తే ఇలా వ్రాస్తున్నారో లేదా కలిప్రభావం చేత సహజం గానే ఇలాంటి బుధ్ధులు అబ్బుతున్నాయో తెలియదు.
శ్రీమద్రామాయణం ప్రకారం సీత రావణుడి ముఖం కూడా ఎన్నడూ చూడలేదు. ఆవిడ ఎంతో కోరికతో శ్రధ్దతో రావణుడి బొమ్మవేయటం అనే వికారమైన అనుచితమైన ఆలోచన చేసిన వారిని ఏమనాలో తెలియటం లేదు.
రావణుణ్ణి సీత బిడ్డగా భావించిందా – ఇదీ ఎంత దరిద్రమైన ఆలోచన!
సీతాపరిత్యాగానికి జానపదులు తమకు తోచిన కారణాలను తాము వెదుక్కున్నారు ఒక పాటలో. ఆపాట ప్రకారం శూర్పనఖ ఒక యోగిని వేషంలో అంతఃపురప్రవేశం చేసి సీతమ్మ దర్శనం చేసుకొని, సీతమ్మను రావణుడి బొమ్మ వేయమని అడిగితే ఆవిడ వాడి ముఖం చూడలేదంటే చూసిన భాగం వేయి అని అడిగింది. సీతమ్మ వాడి కాలి బొటనవ్రేలును మాత్రం చూసింది – అదే వేయగలిగింది. ఆబొమ్మను చుప్పనాక అచ్చు సీతవేసినట్లే రేఖావిన్యాసంతో పూర్తిచేసి ప్రాణం పోసి ఎవరూ గమనించని సమయంలో ఆబొమ్మను రాముడి తల్పంలో దాచి చక్కాపోయింది . అర్ధరాత్రి వేళ ఆబొమ్మ రావణుడు “రావేసీతా లంకకుపోదాం” అని పాట లంకించుకుంటాడు. చివరకు రాముడు ఆబొమ్మను కనుగొని ఆబొమ్మ సీతవేసినట్లుగా ఉందని గ్రహించి కోప్పడి సీతను పరిత్యజించాడు. ఒక చమత్కారకథ. అంతే. గమనించండి. ఇక్కడ రామాయణపాత్రల స్వరూపస్వభావాలను కించిత్తూ మార్చటమూ అపహాస్యం చేయటమూ వంటివి జరుగలేదు. ఈ రచయిత్రిగారి కథకు ఆజానపదకథ ఆధారం అని తెలుస్తూనే ఉంది.
ఈపూర్ణిమ తమ్మిరెడ్డి గారెవరో నాకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. తెలుసుకోవటం వలన ప్రయోజనం ఏమీ లేదు నాకు. కాని ఒక సనాతనధర్మానికి చెందిన స్త్రీ అయ్యుండే అవకాశం ఎక్కువ అనుకుంటాను. (ఏమో మతం మార్చుకున్నవాళ్ళూ ఈమద్య పేర్లు మార్చుకోకుండా గందరగోళం సృష్టిస్తున్నారు ఇలాంటి సనాతనసంప్రదాయవిరుద్ధమైన అవమానకరమైన ధోరణులతో.) కాని ఒక స్త్రీ అయి యుండి గతకాలపు మరొక గౌరవనీయ వనిత మీద బురదచల్లే ఇటువంటి రచన ఎలా చేసారో అర్ధం కావటం లేదు. బహుశః ఒక స్త్రీవాది సీతను సృజించి రామాయణాన్ని ప్రశ్నార్ధకం చేదామన్న అత్యాశో దురాశో కారణం కావచ్చును అనుకుంటున్నాను.
ఏమి చేసి నామనస్సుకు తగిలిన గాయం నుండి నేను కోలుకోగలను? అర్ధం కావటం లేదు.
ఇంకా ఇటువంటి భయంకరమైన రచనలను అధునికసాహిత్యధోరణుల పేరుతో ఐతే నేమి తమకూ బాగా నచ్చి అయితే నేమి ప్రచురించిన ఈ “ఈమాట” పత్రికను నేను తక్షణం దూరం పెట్టటం అత్యవసరం అని భావిస్తున్నాను.
ఈమాటవారూ, మీకో దండం. ఇకపై మీ ఈమాట పత్రికను పొరపాటున కూడా సందర్శించను! నాప్రాణం పోయేంత దెబ్బకొట్టారు మీ రచయిత్రి గారూ మీరూను.
రామచంద్రప్రభో! బుధ్ధితక్కువై ఈమాట పత్రికను చదివినందుకూ, ముఖ్యంగా ఈఘోరమైన కధను చదివినందుకూ నన్ను మన్నించు!
update on 2023-11-7
ఈమాట వారు ఆ కథను తమ సంచికనుండి తొలగించారు. వారు దానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. అవెంతవరకూ నిజమో తెలియదు. ఆకారణాలను సాకుగా చూపించి ఉండవచ్చు నంతే. ఇది నాఊహ మాత్రమే. క్రింద సంపాదకులు మాచవరం మాధవ్ గారి మాటలు ఉటంకిస్తున్నాను.
"నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను."
ఈమాట వారు ఆ కథను తమ సంచికనుండి తొలగించారు. వారు దానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. అవెంతవరకూ నిజమో తెలియదు. ఆకారణాలను సాకుగా చూపించి ఉండవచ్చు నంతే. ఇది నాఊహ మాత్రమే. క్రింద సంపాదకులు మాచవరం మాధవ్ గారి మాటలు ఉటంకిస్తున్నాను.
"నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను."
దయచేసి బాధ పడకండి శ్యామలరావు గారు. వారిని ఖండించినా వారికీ మనం ప్రచారం కలిపించినట్లే. ఆ కథకు లంకె తీసివేయండి మీ బ్లాగులో . అక్కడ మీ వ్యాఖ్య చూసి మీ బ్లాగుకి వచ్చాను చాలా రోజుల తరువాత. గత వారమే వంగూరి గారి సదస్సులో సరిగ్గా దీని గురించే మాట్లాడాను నేను. ఎంత మాట్లాడినా ఇటువంటి వారు ఇంతే అని స్పష్టమయింది ఈ కథతో. నా ప్రసంగం లంకె పెడుతున్నాను. వీలైతే చూడండి .
రిప్లయితొలగించండిఅఖండరామనామసంకీర్తనం చేస్తున్నాను. ఎందుకంటే నా మనస్సు చాలా దారుణంగా గాయపడి ఉంది. ఎప్పటికి ఉపశమనం కలుగుతుందో తెలియదు.
తొలగించండిhttps://sarachandrika.wordpress.com/2023/11/04/13-%e0%b0%b5-%e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%80-%e0%b0%b8-2/
రిప్లయితొలగించండిశ్యామలీయం గారు,
రిప్లయితొలగించండిమీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
నా సహజలక్షణం ప్రకారం ఇటువంటి తెంపరితనానికి ఏ ప్రతిస్పందన తెలియజేయక పోవడమే రివాజు. కానీ మీ ఆవేదన చూసిన తర్వాత, ఆపై ఇటువంటి రోత రాతలకు 'దక్షులెవ్వారలుపేక్ష సేసిరది' అన్న భారత సూక్తి చేసిన హెచ్చరిక మూలానా స్పందించక తప్పని పరిస్థితి.
ఇంత దిక్కు మాలిన రాతలకైనా మళ్లీ మహర్షి ఉచ్చిష్టమే కావలసి వచ్చింది.
ఏఁ? రాముడు, సీత, రావణుడు పేర్లు రాకుండా ఇంత పాటి కథ కూడా రాయలేని అసమర్థతా? ఆ మహా కావ్యానికి, అందులోని పాత్రలకూ స్వతస్సిద్ధంగా ఉన్న ఆకర్షణను సొంత రాతలకు అరువు తెచ్చుకుంటే తప్ప కలం కదలని అగత్యమా?
రాముడు సీత వంటి పుణ్య మూర్తులను మనవారని అనుకుంటే ఇటువంటి అభూతకల్పనలు చేయలేరు. ఇంట్లో మనతోనే ఉన్న, మన అనుకున్న వారి పట్ల వికార భావనలతో కథా కమామిషులల్లడం కుదురుతుందా? అలా అనుకోని ఇలాంటి కొందరు ఆయా పాత్రలను కేవలం ఆధునిక కథా కథనాలకు ముడి సరకు గా మాత్రమే భావించడం వల్ల వచ్చిన ప్రమాదమిది.
కొన్ని ఆహా ఓహో ల కోసం, చప్పట్ల చరుపుల కోసం పూర్వ కవుల పాత్రలకు సొంత ఉద్దేశ్యాలను ఆపాదించడం గర్హనీయం.
జాగృతమైన సమాజం నిలదీసి అడగవలసిన కాలమిది.
విష్ణునందనుల వారు, మీరు నాతో ఏకీభవించుతున్నందుకు సంతోషం. చాలా కష్టం కలుగుతుంది రచనల ముసుగులో ఇటువంటి విధంగా సనాతనసంస్కృతిపైన దాడి జరుగుతుంటే. ఆ దాడిచెసే వారికి ముఖ్యంగా రెండు ఆయుధాలున్నాయి. ఒకటి వామపక్ష అభ్యుదయ భావజాలం పేరుతో విచ్చలవిడితనం ఐతే రెండవది భారతీయసమాజం ఇటువంటి దాడులపట్ల నిర్లిప్తంగా ఉండిపోతూ పరోక్షప్రోత్సాహాన్ని అందించటం.
తొలగించండిఈ పరిస్థితులను అడ్డుపెట్టుకొని ఒకాయన ద్రౌపదిని శ్రీకృష్ణుడికి ప్రేయసి అంటు ఒక నవల వ్రాయటం జరిగితే, సోకాల్డ్ అభ్యుదయ వాదులతో నిండిన ఏదో దిక్కుమాలిన కమిటీ ఆయనకు జాతీయపురస్కారాన్నికట్టబెట్టటం జరిగింది. కొంత ప్రతిఘటనవచ్చినా అది తగిన మోతాదులోనూ లేదు తగినంతగా జాతి ఆవిషయంలోని అపచారాన్ని పట్టించుకోనూ లేదు.
ఇక రామాయణాలు మూడువందలు అంటూ అన్ని రామాయణాలున్నూ ప్రామాణికమే వాల్మీకి ఎక్కువ ఏమిటీ అంటూ కూడా పిచ్చి చర్చ జరిగింది. ఆసందర్భంలోనూ ప్రతిఘటన సరిగా రాలేదు.
జాతిని నిర్వీర్యం చేయటానికి జరుగుతున్న కుట్రను జాతి తెలుసుకొనలేక పోతోందో లేదా తెలిసీ నాకెందుకు అని ఉదాసీనంగా వినాశనకారులను సహించటం ద్వారా ప్రోత్సహిస్తోందో తెలియటం లేదు.
ఈ పెడధోరణులకు అంతు కనబడటం లేదు.
ఇలా పెడరచనలు చేస్తే దబ్బున పేరుప్రతిష్ఠలు వచ్చి వరించేస్తాయని ఒక విషయం చాలా మందికి అవగాహనకు వచ్చింది. దానితో కేవలం గుర్తింపు కోసం ఇలాంటి దరిద్రపు వ్రాతలను సమాజం మీదకు వదలు తున్నారు.
ఒక్క సనాతనధర్మావలంబులైన మనం తప్ప ఏ ఇతరమతస్థులూ ఇలాంటి పెడధోరణులను సహించరు. క్రూరంగా తలలు ఎగరగొడతారు.
మనవాళ్ళు కూడా ఇతరధర్మాల పౌరాణికచారిత్రక గాధలను ఆధారం చేసుకొని ఒక్క పెడసరపు రచనా చేయరు. కొంపమునిగిపోదూ ఒకవేళ చేస్తే.
కాని మన పౌరాణికచారిత్రక గాధలను ఎంత ఛండాలంగా వక్రీకరించినా మనం మాత్రం సహించాలట. భావప్రకటన స్వేఛ్చ అట. కాదంటే మనం మనం అంతా హిందూ ఉగ్రవాదులం ఐపోతాం వాళ్ళ దృష్టిలో. పెద్ద గోలగోల చేస్తారు.
'భారతీయసమాజం ఇటువంటి దాడులపట్ల నిర్లిప్తంగా ఉండిపోతూ ' అందుకే కదండీ. నా బ్లాగులో ఎన్నో సార్లు ఈ విషయాలు చెప్పను. 'controversies కి వెళ్ళం' అంటూ చాలా మంది దూరంగా ఉంటారు ఈ topics కి.
తొలగించండిమొన్న కాలిఫోర్నియా దాకా వెళ్ళి ఆ మాట చెప్పి వచ్చాను. అది కూడా మీరు వ్యాఖ్యలో చెప్పిన ద్రౌపది నవల వ్రాసిన వారి ఎదురుగుండానే. మరి ఈ కథకి స్పందించిన మీరు నా పోస్టు , నా స్పీచ్ కి కనీసం స్పందించను కూడా స్పందించలేదు. మీలాంటి వారు నాలుగు మాటలు చెపితేనే కదా నాలాంటి వారికీ సరియైన పని చేశామా లేదా అని తెలిసేది.
చంద్రిక గారు,
తొలగించండిఈరోజు శనివారం అంటే ఒక డయాలసిస్ వారం మాయింట్లో. ఈరోజున మాశ్రీమతి డయాలసిస్ సెంటరుకు వెళ్తే నేను ఆమెకు ఎప్పటిలాగానే తోడు వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి నాలుగు గంటలు. అసలే గతరాత్రి నిద్రలేదేమో బాగా నిద్రవచ్చింది - ఎక్కువసేపు ఆపుకోలేక పండుకొని ఇప్పుడే లేచాను. మీరుపంపిన లింకును ఇప్పుడు తెరుస్తాను. డయాలసిస్ సెంటర్లో చూడబోతే అక్కడ్ నెట్ చాలా బలహీనంగా ఉండి కుదరలేదు.
మీరు సరైనపని చేసారని తప్పకుండా అభిప్రాయపడుతున్నాను.
మీరేదో నాలాంటి వారు అన్నారు. ఈమాటలోని ఆకథపై అభిప్రాయాలు ఇంకా శోధినో ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి.
నోటబుల్:
1. ఆకథను పొగుడుతూ జిలేబీగారు వ్రాసారు. జిలేబీ గారికి ఉఛ్చనీచాలు లేవు గిల్లికజ్జాలకోసం ఏదన్నా మాట్లాడతారు. పట్టించుకోను.
2. లలిత గారట-విద్యాధికత వలన కాబోలు ఆంగ్లంలోనే వ్రాసారు- తమ వ్యాఖ్యలో నన్ను Someone అని సంబోధించారు. నాపేరు అక్కడ ఉందికదా, వారు నిర్లక్ష్యంగా నన్ను Someone అనటం అగౌరవంగానే భావిస్తున్నాను. కాని అక్కడకుపోయి నిరసన తెలియజేయను. అవసరం లేదు. some ignorant person అనిఉపేక్షిస్తానంతే.
'మీరు సరైనపని చేసారని తప్పకుండా అభిప్రాయపడుతున్నాను.' 🙏🙏🙏
తొలగించండి@author:కర్ణాటకలోని యక్షగాన నృత్యరూపకంగా ప్రదర్శించే ‘చిత్రపట రామాయణం’ అనే జానపద కథ, గిరీశ్ కర్నాడ్ రాసిన రేడియో నాటకం ‘మా నిషాద’ ఈ కథకు ప్రేరణలు.
రిప్లయితొలగించండిhari.S.babu
కమ్యూనిష్టులనే తాయిగండ వెధవలు వాల్మీకి కన్న గొప్ప కవిమూర్ధన్యుల లాగ కనిపిస్తున్నారు ఈ రచయితకి.ఆడ పుటక పుట్టి సీతని ఒక బంధకిలా ఎలా వూహించగలిగింది?ఎలా పుట్టి ఎలా పెరిగి ఇలా తయారవుతారో వీళ్ళు
ఆ నిరర్థక రచన చదివే ఉద్దేశ్యం లేదు. రచయిత మాత్రమే కాక అటువంటి రచనను ప్రచురించిన పత్రిక సంపాదక వర్గం కూడా నిందార్హులే.
రిప్లయితొలగించండిఈమాట వారు ఆ నేత్రోన్మీలనం అన్న కథను తమ సంచికనుండి తొలగించారు. వారు దానికి కొన్ని కారణాలు కూడా చెప్పారు. అవెంతవరకూ నిజమో తెలియదు. ఆకారణాలను సాకుగా చూపించి ఉండవచ్చు నంతే. ఇది నాఊహ మాత్రమే. క్రింద సంపాదకులు మాచవరం మాధవ్ గారి మాటలు ఉటంకిస్తున్నాను.
రిప్లయితొలగించండి"నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను"
అటువంటివారిని ఎందుకు బయటపెట్టలేరు? కప్పిపుచ్చుకోడానికి సాకులు వెతకడం ఇటువంటివారికి అలవాటే!
రిప్లయితొలగించండి// “…. ఆమె భద్రత గురించిన ఆందోళనతో, …” //
రిప్లయితొలగించండిబెదిరింపుల గురించి ఆందోళన మంచిదే గానీ, అసలు కథాంశమే అనుచితమైనది అనిపించ లేదా సంపాదకులకు?
ఆశ్చర్యం లేదు లెండి - రంగనాయకమ్మ గారి “విషవృక్షం” గురించి ఏం చెయ్యగలిగారు గనక ఆనాటి వారు.
విషవృక్షానికి రామారావు గారి సుందరకాండ పారాయణం పోటీ వచ్చిందండీ. సుందరకాండను ఊరూవాడా నెత్తిన పెట్టుకున్నారు. విషవృక్షాన్ని కమ్యూనిస్టులు కూడా మొయ్యలేదు ఆవిడతో ఉన్న విబేధాల కారణంగా.
తొలగించండిశుభవార్త!
రిప్లయితొలగించండినాకు తెలిసి ఈ పత్రిక లెఫ్ట్ lib వాళ్లది అనిపిస్తోంది.వచ్చిన వ్యతిరేకతను తట్టుకోలేక కధను తొలగించింది ఈమాట.
నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను.
మాధవ్ మాచవరం
ఈమాట సంపాదకుడు.
06 నవంబర్ 2023.
ఈవార్తను ఇప్పటికే టపాలో జతపరచానండీ. అలాగే విడిగా ఒక వ్యాఖ్యగా ఇచ్చానిక్కడ.
తొలగించండిఈమాట పత్రికవారికి ఆకథా రచయిత్రి యొక్క గౌరవమర్యాదల గురించిన ఆలోచన కలిగింది. సంతోషం. కాని వారికి యావద్భారతమూ అనాదిగా ఎంతో ప్రేమతో అభిమానంతో గుండెల్లో నింపుకొని పూజించే సీతారాముల గౌరవమర్యాదల గురించిన ఆలోచన ఏదీ ఈకథను ప్రచురణకు అంగీకరించే సమయంలో కలుగలేదు కదా? ఏమి చిత్రం!
రిప్లయితొలగించండిసీతారాముల స్థానం ఈదేశంలో తరాలుమారినా యుగాలు మారినా చెక్కుచెదరనిది. మరి తనబోటి నాబోటి వాళ్ళు ఎందరో వస్తూపోతూ ఉంటారు కాని అటువంటి వారి ప్రతిష్ఠలూ గౌరవాలూ అబిమానాలూ తాత్కాలికమైనవి.
...
రిప్లయితొలగించండిఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, ... గట్రా కారణాలు గా రచయిత్రి గారి కోరిక మీద కథను తొలగించడం గట్రా...
రాసినది మనసా వాచా నమ్మకమున్న వాళ్లు ఇలా చేస్తారా ఎవరైనా దమ్మొడ్డి నిలబడతారు గాని ధైర్యముగా !
ఏదో రాయి వేసి చూద్దామూ సీతమ్మ మీద అని అవాకులు చెవాకుల కథ నల్లిన పర్యవసానమిలాగే వుంటుంది.
తనదాకా వస్తే కాని తెలియదంటారు ఇదేనేమో !
జిలేబీ గారూ, మీ కత్తికి రెండువైపులా పదును బాగానే ఉందే!
తొలగించండికొద్ది రోజుల క్రిందటనే మీరు చేసిన వ్యాఖ్య ఏమిటీ? ఆ వ్యాఖ్యలో మీరు "ఈ కథ తెలుగు కథాలోకంలో చిరస్థాయి గా నిలిచి పోగలిగిన ఉత్తమ కథ అన్న దానిలో సందేహం ఏ మాత్రం లేదు. తమ్మిరెడ్డి గారి ఈ ప్రయత్నం ముదావహం." అన్నారు కదా? అప్పుడేప్లేటు ఫిరాయించారే?
ఇప్పుడు "సీతమ్మ మీద అని అవాకులు చెవాకుల కథ నల్లిన పర్యవసానమిలాగే వుంటుంది." అని వక్కాణిస్తున్నారు.
సీతమ్మ మీద అవాకులూ చెవాకులూ కూర్చి అల్లిన కథను కొద్దిరోజుల క్రిందట ఉత్తమ కథ అనుకున్నారా! ఇప్పుడు చెత్తకథ అని ఒప్పుకుంటున్నారా? భలే! భలే.
పాఠకులారా జిలేబీ గారు మొన్ననే చేసిన సదరు వ్యాఖ్యను ఒకసారి చదివి మీరే ఆలోచించండి ఆవిడ ధోరణిని గూర్చి.
ఆ పాటి సెటైరు ( ఉత్తమ కథ గట్రా)/ కూడా మీరు గ్రహించకుంటే నేనేమి చేతునో ...
తొలగించండినానాటికి తీసికట్టు నాగంభొట్లయిపోతున్నానని ఆ మధ్య ఎవరో వాపోయేరు ఎవరో మరిచి పోయా :)
“ఎప్పటికెయ్యది ప్రస్తుతము …….”
తొలగించండిఅన్నది మీకు తెలుసుగా శ్యామలరావు గారూ. “ప్లేటు ఫిరాయించడం” కొందరికి బహు సుళువు 🙂.
రోత , కంపరం కలిగించే ధోరణి తెలిసి కూడా బ్లాగు పెద్దలు శ్యామలీయం, విన్నకోట, శర్మ గారు జిలేబీ వంటి వారిని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అనుకుని ఏమి లాభం.
తొలగించండిశ్యామలీయం9 నవంబర్, 2023 6:06 AMకి
రిప్లయితొలగించండిజిలేబి గోడమీద పిల్లి(గోపి),గాలివాటు జీవి,తోకలేని గాలిపటం. తెలిసి మీరు కలత చెందడమే చిత్రం. ఆ పై మా భాగ్యం
స్వస్తి.
పలుకుడు పలికెడు విధమున
తొలగించండిపలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల నిపుణి జిలేబి యనిరి
పలికెడు తెఱగు భళి యనుచు పలుకుచు విబుధుల్
జిలేబీ గారు, ఎప్పటికైన కనీసం ఒక పద్యం ఐనా సుష్టువుగా వ్రాయగలరా? అతుకులబొంతలూ కాపీపేష్టులూ కొక్కిరాయిమాటలూ మాత్రమేనా? మీధోరణి చాలా చిరాగ్గా ఉంది. మిమ్మల్ని మరలా బహిష్కరించే రోజు త్వరలోనే వచ్చేలా ఉంది!
తొలగించండిపలికెడిది బిలేజీ యట
రిప్లయితొలగించండిపలికించెడి వాడు జిలేబామ్మ అట
తా పలికిన వికారమగునట
వేరొండు బాధ కలుగుట యేలా
దేవతలను కించపరిచే రాతలు
రిప్లయితొలగించండినిస్సిగ్గుగా సమర్థించుకునే ధూర్తులు
స్వధర్మం పైన కారు కూతలు
ఇతర మతాలన్న నోళ్ళు మూతలు.
సదరు కధారచయిత్రి గారు ప్రమాదం శంకించి గమనించి తనకథను ప్రస్తుతానికి భద్రంగా దాచియుంచమని కోరారట. ఆందుకని తాత్కాలికంగా తొలగించిన ఆకథను మరలా మహదానందంగా ప్రచురించే సుముహూర్తం కోసం ఈమాట పత్రికాసంపాదకులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారట. ఇది నాఊహ కాదు ఆపత్రికవారే తమంతగా ఒకవ్యాఖ్యలో సెలవిచ్చిన వాక్యం.
తొలగించండి