కం. నీవాడను నేనన్నది
నీవెఱిగియు నెఱుగ నటుల నిలచెద వేలా
రావయ్యా యికనైనను
నావంకకు రామచంద్ర నళినదళాక్షా
నీవెఱిగియు నెఱుగ నటుల నిలచెద వేలా
రావయ్యా యికనైనను
నావంకకు రామచంద్ర నళినదళాక్షా
ఓ రామచంద్రప్రభూ!
భలే వాడివయ్యా.
నేను నీవాడినని నీకు బాగా తెలుసు.
ఐనా తెలియనట్లు నటిస్తున్నావు
అలా దూరందూరంగా నిలబడి తమాషా చూస్తున్నావు.
నాటకాలు చాలయ్యా!
ఓ తామరసాక్షా, ఇకనైన నాదగ్గరకు రావయ్యా స్వామీ.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.