కం. నీతో సంభాషించుట
ప్రీతిని కలిగించు నాకు విశ్వమయా ఓ
సీతాపతి రుచికరములు
నీ తీయని పలుకు లగుట నీరజనయనా
ఓ రామచంద్రప్రభూ!
సీతాపతీ!
లోకులతో వ్యర్థ ప్రసంగాలు చేయటం పైన నాకు ఆసక్తి లేదు.
అవి మనస్సుకు గ్లాని కలిగిస్తాయి. నిష్ప్రయోజనం అవి.
నీతో సంభాషించటం అంటావా?
మధురాతిమధురాలు నీపలుకులు.
ఓ విశ్వమయా. నీమధురభాషణలు బహురుచికరాలు.
తామరపూవు రేకులవలె అందమైన నీవిశాల నయనాలతో కరుణామృతం కురిపిస్తూ నీవు పలుకుతూ ఉంటే అంతకంటే సంతోషం వేరే ఉంటుందా?
అందుకే అవి నాకు బహుప్రీతికరాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.