16, నవంబర్ 2023, గురువారం

సెలెక్టివ్ సింపతీ!

 

చనిపోయిన మరియు చనిపోతున్న గాజానగరపు పనిపిల్లల్లారా 
ఇంకా చనిపోబోతున్న మరింతమంది గాజానగరపు పనిపిల్లల్లారా 
మీకందరికీ వీడ్కోలు ఉత్సవాలను ప్రారంభించింది ఎవరో తెలుసా?
కొందరు రాజకీయకవులు పాడుతున్నట్లు ఇజ్రాయేల్ కాదు
మీకందరకూ ఇన్నాళ్ళూ సుపరిపాలన అందించిన హమాస్ వాళ్ళు
వాళ్ళు ఇజ్రాయేల్ గర్భిణీల పొట్టలు చీల్చి ఎందరో పసికందుల్ని చంపారు.
అప్పుడీ రాజకీయకవులు ఆకళ్ళుతెరవని పిండాలమీద కవితలు పాడలేదు
ప్రతిహింస చెడ్డది అనే ఈకవులు తొలిహింసాకాండను చెడ్డది అనలేదు.
ఆ పుట్టని బిడ్డలను నాడు వాళ్ళు క్షమాపణ అడుగలేదు
బిడ్డలను కనవలసిన పిచ్చితల్లులనూ వాళ్ళు క్షమాపణ అడుగలేదు
ఇప్పుడు మిమ్మని క్షమాపణ అడుగుతున్నారు.
ఎంత సెలక్టివ్ గిల్ట్! ఎంత సెలెక్టివ్ సింపతీ. 
ఏ దిక్కుమాలిన హింసారంభకులనూ చచ్చినా క్షమించకూడదు
సెలెక్టివ్ సింపతీ డ్రామాల కవుల్ని చచ్చినా క్షమించకూడదు
గాజానగరపు పనిపిల్లల్లారా మీరు హమాస్ వాళ్ళని క్షమిస్తారా?
గాజానగరపు పనిపిల్లల్లారా మీరీ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తారా?
ఓ కాలమా నీవు ఈహమాస్ వాళ్ళని క్షమిస్తావా?
ఓ కాలమా ఈ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తావా?నోట్:   ఇది గాజా పసిపిల్లలు అనే కవితకు ప్రతిస్పందనగా వ్రాసిన కవిత.