అర్ధరాత్రి వేళ స్ప్రింగులా లేచి కూర్చుంది సువర్ణ.
రెండు మూడు సార్లు తట్టిలేపితే భాస్కర్ కళ్ళు నులుముకుంటూ లేచాడు.
అతడు విసుగ్గా ఏమన్నా అనేవాడేమో. కాని ఈలోగానే సువర్ణ "సమ్ ధింగ్ రాంగ్ భాస్కర్" అంది!
భాస్కర్ కొంచెం అలర్ట్ అయ్యాడు. "ఏమిటి?" అన్నాడు తనూ లేచి కూర్చుని.
సువర్ణ నేరుగా పాయింట్ లోనికి వచ్చింది.
"అల్బం కొంచెం బరువుగా ఉంది. అందుచేత శాంతి హేండ్‍బేగ్ బరువుగా అనిపించి, దాన్ని మంచం మీద పెట్టింది"
"ఐతే" అన్నాడు భాస్కర్. అతనికి ఇంకా ఆ మాట వెనుక విషయం అర్థం కాలేనట్లుంది.
"హేండ్‍బేగ్ మంచం మీద పెట్టాకే, ఇద్దరమూ నీ కప్‍బోర్డ్ దగ్గరకు వెళ్ళాం"
"ఐతే" అన్నాడు అనుమానంగా భాస్కర్.
"అర్థం కాలేదా భాస్కర్? శాంతి నన్ను ట్రిక్ చేయాలంటే, నన్ను దాటి వెళ్ళి ఆ హేండ్‍బేగ్ అందుకోవాలి."
"ఓ. ఓ" అన్నాడు భాస్కర్.
సువర్ణ స్థిరంగా అంది. "భాస్కర్ ఏదో జరిగింది. అది మన లాజికల్ రీజనింగ్‍కి అందటం లేదు"
భాస్కర్ కొంచెం అనునయంగా అన్నాడు. "మనం ఇంకా బాగా అలోచించాలి, ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం"
సువర్ణకు ఏడుపు గొంతు వచ్చేసింది. "లేదు భాస్కర్. ఇదంతా నార్మల్ కాదు. అసలు ఈ ఇంటి గురించి వాకబు చేసావా నువ్వు ముందుగా" అని నిలదీసింది.
భాస్కర్ కొంచెం గిల్టీగా ముఖం పెట్టాడు.
సువర్ణ పసిగట్టింది.
"విషయం చెప్పు" అంది ఆగొంతులో కోపం ఎక్కువగా ఉందో భయం ఎక్కువగా ఉందో చెప్పటం కొంచెం కష్టం.
కొంచెం లోగొంతుతో భాస్కర్ చెప్పాడు. "మనకంటే ముందు శాంతి, కుమార్ అని ఇందులో ఉండే వాళ్ళట. వాళ్ళు ఏదో పని మీద బెంగుళూరు వెళ్తే, అక్కడ శాంతి చనిపోయింది హఠాత్తుగా. కొన్నాళ్ళకు కుమార్ వచ్చి సామాను తీసుకొని ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడట."
సువర్ణ కళ్ళు పెద్దవయ్యాయి. "శాంతి చచ్చిపోయిందా!"
భాస్కర్ దోషిలా ముఖం పెట్టి "అవును" అన్నాడు.
సువర్ణ ఏడుపు మొదలు పెట్టింది. "ఆ శాంతి దయ్యమై వచ్చి ఇదంతా చేసింది. మనం రేపే ఈ ఫ్లాట్ ఖాళీ చేసి అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళిపోదాం భాస్కర్" అంది.
భాస్కర్ కసురుకున్నాడు. "పిచ్చిదానిలా మాట్లాడకు. దయ్యాలూ గియ్యాలూ ఏమీ ఉండవు"
"మరిందతా ఏమిటి" అని అరిచింది సువర్ణ హిస్టీరికల్‍గా.
"నాకు తెలియదు. ఆలోచించాలి. దెయ్యాలంటూ ఎక్కడా లేవు. ఎవరో ఏదో చేసారు. తెలుసుకుందాం" అన్నాడు భాస్కర్ మొండిగా.
"నో భాస్కర్. ఆ శాంతి మళ్ళీ వస్తుంది. మనకి చాలా ప్రమాదం. వెంటనే వెళ్ళిపోదాం" అంది.
"చచ్చినామె ఎలా వస్తుంది" విసుక్కున్నాడు భాస్కర్.
"అది దయ్యమైంది కాబట్టి" అంది అందోళనగా సువర్ణ. "భాస్కర్. నీ హేతువాదాలు కట్టిపెట్టు. నేనిక్కడ ఒక్కక్షణం ఉండను కాక ఉండను" అంది అరుస్తున్నట్లుగా.
గబగబా సైడ్ టేబుల్ మీద ఉన్న తన మొబైల్ తీసి యూట్యూబ్‍లో ఆంజనేయ దండకం పెట్టింది.
భాస్కర్ గోడ గడియారం కేసి చూసాడు. రెండున్నర.
"తెల్లవార్లూ ఇలా ఇది ప్లే చేస్తూ ఉంటావా" అన్నాడు కోపంగా.
"యస్" అంది సువర్ణ చాలా ధృఢంగా.
"ఇక నిద్రపోయినట్లే" అన్నాడు భాస్కర్ చిరాకుగా.
సువర్ణ గంయ్ మంది. "టు హెల్ విత్ యువర్ స్లీప్. అది మళ్ళీ ఎక్కడొస్తుందో అని హడిలి చస్తున్నా"
భాస్కర్ పిచ్చిదాన్ని చూసినట్లు చూసి అన్నాడు "ప్లీజ్ సువర్ణా. బీ రేషనల్!"
సువర్ణ మాత్రం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని మొదలు పెట్టింది ఆ దండకం ఆడియోకు తోడుగా.

(సశేషం)
అన్యాయం గురువు గారు
రిప్లయితొలగించండిమీరు మొదలుపెట్టినది సీరియల్ అయితే చివర్లో (ఇంకా ఉంది) అని రాయాలి. అసలు మొదటి భాగం చదివాక ఇంత అర్ధాంతరంగా ముగించారేమిటా అనిపించింది. ఇంతకీ ఇంకా ఉందా, తర్వాత ఏమైంది? టెన్షన్ పెట్టేస్తున్నారు. టివి సీరియల్ లాగా ఉంది. రాముణ్ణీ అమ్మనీ వదిలేసి ఇటు వచ్చారేమిటి? (సర్దాకే అడుగుతున్నా).
కొనసాగించండి బాగుంది.
మీ సూచన బాగుంది. పాటిస్తాను.
తొలగించండిఎవ్వరినీ వదలను.
హమ్మ, ఇప్పుడు "సశేషం" అని తగిలించారు. ఇందాకటి వరకు దెయ్యం అనే ముగింపే ఖాయం చేసేసుకుందామనుకున్నాను. సరే, కొనసాగింపు కోసం వేచి చూద్దాం.
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఅదిగో వచ్చేసింది భూతం జిలేబి భూతం :)
జిలేబి
ఆ భూతం జిలేబీనే అయ్యుంటుంది, నాకు తెలుసు!
తొలగించండి