25, జులై 2024, గురువారం

జానకిరామా ఓ జానకిరామా


జానకిరామా ఓ జానకిరామా బి

రాన నన్ను కావవయా జానకిరామా వి

జ్ఞానమయదివ్యరూప జానకిరామా ప్ర

జ్ఞానఘనానందరూప జానకిరామా


సకలరాక్షసాంతకుడవు జానకిరామా నీవు

సకలజగద్రక్షకుడవు జానకిరామా నీవు

సకలయోగిపూజితుడవు జానకిరామా నీవు

సకలభక్తవరదుడవో జానకిరామా


స్మరాంతకాభినందితుడవు జానకిరామా నీవు

సరోజభవవినుతుడవు జానకిరామా నిన్ను

స్మరించినంత కరుణింతువు జానకిరామా భవ

జ్వరమునణచు నీనామము జానకిరామా 


సదమలసత్కీర్తిపూర్ణ జానకిరామా  నీవు

సదయుడవని నేనెఱుగుదు జానకిరామా నేను

సదా నిన్ను స్మరించెదను జానకిరామా నీవు

సదా  నన్ను కరుణించుము జానకిరామా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.