9, జులై 2024, మంగళవారం

నేనే


ఆకునై గాలియలకు ఆడేది నేనే

ఆకును కదలించు గాలియలను నేనే


కలకల స్వనములతో కదలాడు ఆకుల

తులలేని పూరెమ్మ  కులుకులును నేనే

యలలయలల గాలికి తలయూచు ఆకుల

తిలకించు కనుగవయు తెలియగ నేనే


గాలియలల మధ్యన గడుసుగా తోచే

మేలిసుగంధాల పూబాలయును నేనే

గాలియలలలో సుగంధాల జాడ నేనే

రోలంబమై పువుల వ్రాలునది నేనే


మునివృత్తి పొదవెనుక మునిగినది నేనే

మునినిదాచు మంచిపూపొదయును నేనే

మునితలపై వ్రాలిన పుష్పమును నేనే

మునిచిత్తమున రామమూర్తియును నేనే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.